‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌లతో మిల్కీబ్యూటీ తమన్నాకి స్టార్ హీరోల పక్కన భారీ కమర్షియల్ హిట్ కొట్టినా రాని క్రేజ్ వచ్చేసింది. నిజానికి ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరోయిన్ కంటే తమన్నానే తన పర్ఫార్మెన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇరగదీసేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
తమన్నా, తమన్నా.. కొద్ది రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో మిల్కీబ్యూటీ పేరు మార్మోగిపోతుంది. స్టార్ హీరోల పక్కన భారీ కమర్షియల్ హిట్ కొట్టినా రాని క్రేజ్ వచ్చేసింది. ఇండస్ట్రీ ఏదైనా ఇప్పుడు తమన్నా అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. 2005లో హిందీలో కెరీర్ స్టార్ట్ చేసి టాలీవుడ్, కోలీవుడ్‌లో యంగ్, సీనియర్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ఇటీవల తమన్నా ఆన్ స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లోనూ అందాల ఆరబోతతో హల్ చల్ చేస్తోంది. గత 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తమన్నా సీనియర్ అయిపోయింది.. ఇప్పుడు ఫామ్‌లో లేదు అంటూ కామెంట్స్ వచ్చాయి. అదే టైంలో ఆమె చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కట్ చేస్తే ఇప్పుడు క్రేజీ ఆఫర్లతో బాలీవుడ్, టాలీవుడ్ వయా కోలీవుడ్ అన్నట్లు ఫుల్ బిజీ అయిపోయింది. దానికి మెయిన్ రీజన్ బోల్డ్ సన్నివేశాలకు ఎస్ చెప్పడం, అలాగే కెమెరా ముందు, వెనుక కూడా పిచ్చ గ్లామర్‌గా కనిపించడమేనంటూ కామెంట్స్ వస్తున్నాయి.
తమన్నా ముందు నుండి ఫిట్‌నెస్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ, చక్కటి ఫిజిక్ మెయింటెన్ చేస్తుంటుంది. ఇప్పటి వరకు లిప్ లాక్ కూడా చేయనని గిరి గీసుకుని కూర్చున్న తమ్మూ ఇప్పుడు హద్దులు చెరిపేసింది. ఎప్పటిలానే ఎనర్జిటిక్‌గా కనిపించడంతో పాటు అదిరిపోయే గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. తెరమీదే అనుకుంటే తెర వెనుక కూడా ఇంతలా సోకులారబోస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాం తమన్నా అంటున్నారు కుర్రకారు. ఇక ‘జీ కర్దా’ వెబ్ సిరీస్‌లో నటించి మతి పోగొట్టేసింది మిల్కీబ్యూటీ. బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్, విచ్చలవిడి శృంగార సన్నివేశాలతో చూసే వాళ్లకి సాలిడ్ షాకిచ్చింది. తమన్నా ఇంతలా రెచ్చిపోయి రచ్చ చేసిందేంటబ్బా అని డిస్కస్ చేసుకుంటుండగానే.. ‘లస్ట్ స్టోరీస్ 2’ తో మరో షాక్ ఇచ్చింది.
రియల్ లైఫ్ ప్రియుడు విజయ్ వర్మతో రీల్ రొమాన్స్‌లో అదరగొట్టేసింది. రెండు సిరీసుల్లోనూ బోల్డ్ సీన్లలో తమన్నా నటన, ఇచ్చిన హావభావాలు చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఇక ‘జీ కర్దా’ సిరీస్ గురించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. తమన్నా క్యారెక్టర్‌కి ముందుగా హాట్ బ్యూటీ పూజా హెగ్డేని అనుకున్నారట. కథ విన్న తర్వాత పూజా పాప టాప్ తీసి రొమాన్స్ చేయడానికి ‘నో’ చెప్పిందట. దీంతో తమ్మూని ఫిక్స్ చేశారట. నిజానికి పూజా కంటే తమన్నానే తన పర్ఫార్మెన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇరగదీసేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో పూజా హెగ్డేకి బ్యాడ్ టైం నడుస్తుంది. ‘గుంటూరు కారం’ మూవీ నుండి తప్పించారు. కోట్లాది రూపాయల పారితోషికం తీసుకునేది పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కేవలం లక్షలు తీసుకుని ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆమె నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి. ఇప్పుడు ‘జీ కర్దా’ సిరీస్ మిస్ చేసుకుందనే న్యూస్ తెలియడంతో ‘బ్యాడ్ లక్‌ని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని తిరుగుతున్నట్టుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.