రీ ఎంట్రీ తర్వాత జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవిలోని మాస్ యాంగిల్‌ని ప్రేక్షకులకు చూపించడానికి యంగ్ డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు. ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ తో సూపర్ హిట్ కొట్టిన చిరు.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చేస్తున్నారు.
రీ ఎంట్రీ తర్వాత జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవిలోని మాస్ యాంగిల్‌ని ప్రేక్షకులకు చూపించడానికి యంగ్ డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు. ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ తో సూపర్ హిట్ కొట్టిన చిరు.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చేస్తున్నారు. తమిళ్ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘సైరా’ తర్వాత మిల్కీబ్యూటీ తమన్నా మరోసారి చిరుతో జతకడుతుండగా.. కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలుగా, ఆమె భర్తగా సుశాంత్ కనిపించనున్నారు. గురువారం సాయంత్రం ‘భోళా శంకర్’ థియేట్రికల్ ట్రైలర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు.
‘భోళా శంకర్’ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చిరు మార్క్ మేనరిజమ్స్, ఎక్స్ప్రెషన్స్, తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. చిరు గెటప్, బాడీ లాంగ్వేజ్ చూస్తే మరింత యంగ్‌గా కనిపిస్తున్నారు. కలకత్తాలో అమ్మాయిలు వరుసగా కిడ్నాప్ అవడం, ‘పోలీసులు నేరస్థుల కోసం గాలించడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ ప్రాబ్లమ్ వస్తే పోలీసుల దగ్గరకొస్తారు.. అదే పోలీసులకు ప్రాబ్లమ్ వస్తే భోళా భాయ్ దగ్గరకు వస్తారు’ అనే డైలాగ్ చిరు క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉండబోతుందో తెలియజేస్తుంది.
‘నీ వెనుక మాఫియా ఉంటే.. నా వెనుక దునియా ఉంది’.. ‘రంగస్థలం’లో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడ్రా’ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ట్రైలర్ చివర్లో తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ఇమిటేట్ చేయడం ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు. మణిశర్మ కొడుకు మహతి స్వరసాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్, డడ్లీ విజువల్స్ చక్కగా కుదిరాయి. సిస్టర్ సెంటిమెంట్‌తో పాటు చిరు నుండి ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో రూపొందుతున్న కమర్షియల్ ఫిలిం ‘భోళా శంకర్’ ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.