ఈ మధ్య సెలబ్రిటీల చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. అలానే ఇప్పుడు ఓ గ్లామరస్ హీరోయిన్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ ఫోటోలో ఉన్న చిన్నారి కూడా ఒక సెలబ్రిటీనే. ఇప్పుడొక గ్లామరస్ హీరోయిన్. చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉందో ఇప్పుడు కూడా అంతే ముద్దుగా ఉంది. ఎప్పుడూ గ్లామరస్ ఫోటోలతో మత్తెక్కించే ఈ సొగసరి అప్పుడప్పుడు మాత్రం చీరల్లో నిండుగా దర్శనమిస్తుంటుంది. ఈ చిన్నది నవ్వితే భలే అందంగా ఉంటుంది. మాట్లాడితే గుండెల్లో గిటార్ మోగించినట్టు ఉంటుంది. సిగ్గే సిగ్గుపడుతుందేమో అనేంతగా సిగ్గు పడుతుంది. ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో వార్తల్లో ఉంటుంది. చేసిన సినిమాలు తక్కువే. కానీ క్రేజ్ మాత్రం బాగానే సంపాదించుకుంది.
ఈమె ఒక స్టార్ హీరోయిన్ కూతురు. ఈమె తల్లి భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. అందంలో ఆమెకు పోటీ లేరు ఎవరు. అంత అందంగా ఉండేది. అలాంటి అందగత్తెకి పుట్టిన అప్సరసే ఈ చిన్నారి. చిన్నప్పుడు ఎంత అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు మాత్రం గడసరి పిల్లలా తయారైంది. ఈ అమ్మాయి మరెవరో కాదు, ఇండియన్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. జూనియర్ అతిలోక సుందరిలా కుర్రాళ్ళ మతిపోగొడుతున్న బ్యూటీ జాన్వీ కపూర్ త్రో బ్యాక్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈమె నటించిన బాలీవుడ్ మూవీ ‘మిలి’ నవంబర్ 4న రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొంటుంది. ప్రమోషన్స్ లో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తన సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకుంటుంది.
విజయ్ దేవరకొండపై క్రష్ ఉన్నట్టు ఆ మధ్య కాఫీ విత్ కరణ్ షోలో వెల్లడించింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండకి పెళ్లి కూడా చేసింది. అదేనండి విజయ్ దేవరకొండకి ఫిజికల్ గా పెళ్లి అయిపోయిందని కామెంట్స్ చేసింది కదా. విజయ్, రష్మికల రిలేషన్ షిప్ ని పబ్లిక్ గా బయటపెట్టేసి హాట్ టాపిక్ గా నిలిచింది. మాటల్లోనే కాదు, చేతల్లో కూడా అంతే బోల్డ్ గా ఉంటుంది ఈ హాట్ బ్యూటీ. ఇన్స్టాగ్రామ్ లో డైలీ హాట్ ఫోటోలతో ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తుంటుంది. సినిమాల్లో క్రేజ్ ఎలా ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె అందాల ఆరబోతకు విపరీతమైన క్రేజ్ ఉంది. బోల్డ్ ఫోటోలు, ఎక్సర్సైజ్ వీడియోలు, మైండ్ పోగొట్టే బోల్డ్ యోగా ఫోటోలు పెడుతూ కుర్రాళ్ళకి మత్తెక్కిస్తూ ఉంటుంది.
రకరకాల రంగుల డ్రెస్సులు, మోడ్రన్ డ్రెస్సులు వేసి పరువాల విందుతో చంపుతుంటుంది. ఇంత గ్లామరస్ హీరోయిన్ అయినా.. దేవుడి విషయంలో మాత్రం చాలా భక్తితో ఉంటుంది. రీసెంట్ గా లంగా ఓణీ ధరించి పదహారణాల తెలుగమ్మాయిలా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. లంగా ఓణీలో జాన్వీ సూపర్బ్ ఉంది అసలు. మోడ్రన్ డ్రెస్సుల్లో అయినా, సాంప్రదాయ దుస్తుల్లో అయినా జాన్వీ కపూర్ సూపర్ అంతే. తెలుగులో కూడా ఈమెకి ఫాలోయింగ్ ఉంది. ఈ హీరోయిన్ గనుక మన తెలుగు సినిమాల్లో నటిస్తే సూపర్ ఉంటుంది. ఇప్పటికే ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందని తన కోరికను బయటపెట్టింది కూడా. మరి ఆమె కోరికను ఎవరు తీరుస్తారో చూడాలి.