ఆర్జీవీ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేస్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమా సిండికేట్ ప్రకటన తరువాత ఎలాంటి అప్‌డేట్ లేని రామ్ గోపాల్ వర్మ సడెన్‌గా హారర్ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. గతంలో రాత్, భూత్, డర్నా మనా హై, డర్నా జరూరీ హై వంటి సినిమాలతో భయపెట్టిన ఆర్జీవీ ఇప్పుడు మరోసారి అందుకు […]
సినిమా రంగంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై తరచూ వివిధ రకాల ఆరోపణలు వింటునే ఉంటాం. అయితే ఇది అనాదిగా ఉన్నదే. ప్రతి స్టార్ హీరోయిన్ దాదాపుగా ఇలాంటి దశను దాటి వచ్చిన పరిస్థితి. బాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్‌కు సైతం ఇదే అవమానం. నొప్పితో విలవిల్లాడుతున్నా వదల్లేదట. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు చేదు అనుభవాలు, అవమానకర సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. లైంగిక వేధింపులు కూడా తప్పవు. దీనికి ఎవ్వరూ అతీతం కాదు. […]
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనే సామెత వినే ఉంటారు. ఈ సామెతను నూటికి నూరుపాళ్లూ పాటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఏకంగా ప్రియురాలికి ఇంటిని అద్దెకివ్వడమే కాకుండా నెలనెలా వసూలు చేస్తున్నాడట. ఆశ్చర్యంగా ఉందా..వాచ్ ద స్టోరీ సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఎంత ఉంటుందో ఆదాయం కూడా అంతే ఉంటుంది. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునేందుకు కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇతర రంగాల్లో పెట్టుబడి పెడుతుంటారు. స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయడం, అద్దెకిచ్చి కోట్లు గడించడం […]
బాలీవుడ్ ఒకప్పటి అగ్ర హీరో గోవిందా గురించి తెలియనివాళ్లుండరు. ఖాన్స్ అండ్ కపూర్స్ రాజ్యమేలుతుండగానే తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు 62 ఏళ్ల వయస్సులో లైంగిక వేధింపులు, వ్యభిచార ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అది కూడా భార్య నుంచి.. సినిమా పరిశ్రమలో ఎవరు ఎప్పుడు విడాకులు తీసుకుంటారనేది ఊహించలేరు. విడాకులు, రిలేషన్ షిప్ ఇక్కడ కామన్. ఒక్కోసారి నిజం లేకపోయినా పుకార్లు మాత్రం షికారు చేస్తుంటాయి. తాజాగా ఓ స్టార్ హీరో గురించి వస్తున్న వార్తలే ఆందోళన రేపుతున్నాయి. బాలీవుడ్‌లో […]
ఏం మాయ చేసిందో గానీ ఇంకా ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆర్మాక్స్ మీడియా ర్యాంకింగ్‌లో టాప్ హీరోయిన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. సమంత సరసన ఇంకా కొందరు తెలుగు నటీమణులు కూడా ఉండటం విశేషం. టాప్ 10లో ఎవరెవరున్నారో తెలుసుకుందాం. చలనచిత్ర రంగానికి సంబంధించి ఆర్మాక్స్ మీడియాకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ రంగంలో టాప్ 10లో ఎవరున్నారనేది ప్రతి నెలా జాబితా విడుదల చేస్తుంటుంది. ఇందులో భాగంగా ఆర్మాక్స్ మీడియా నుంచి 2025 […]
అందం అభినయంతో ఆకట్టుకునే ముద్దుగుమ్మల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మగాడిలా ఉంటుందంటూ సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు ఆ బాలీవుడ్ భామ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఓ వైపు మరాఠీ, హిందీతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటున్న అందాల భామ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో అందర్నీ ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ మరి కొన్ని సినిమాలు చేసింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ […]
ఇటీవల కాలంలో వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న సినీ సెలబిట్రీలు కాలం చేస్తున్నారు. ఈ ఏడాదిలో దర్శకుడు విశ్వనాథ్ మొదలుకుని అనేక మంది సీనియర్ నటీనటులు, టెక్నీషియన్లు తుది శ్వాస విడిచారు.
తింటే గారెలే తినాలి.. వింటే మహాభారతమే వినాలి.. అనే రోజులు పోయాయి. ఇప్పుడు తింటే గారెలే తినాలి చూస్తే చంద్రయాన్ 3 విజయం చూడాలి అన్న రేంజ్ లో సాగింది నిన్నటి ముచ్చట.
రాఖీ సావంత్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వివాదాలే. గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ పోజింగ్ తో శృంగారతారనా అనే ముద్ర వేసింది ప్రేక్షకుల్లో. తరచుగా ఏదో ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలవడం రాఖి సావంత్ కు అలవాటు.
మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ కి పెళ్లి చేసుకోవాలని ఉందట. కానీ పిల్లలు అడ్డుపడుతున్నారని వాపోతుంది.