అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపుర్ మొదట అందరికి తెలిసిందే. సినీ పరిశ్రమకు 'ధడక్' అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాందించింది. నటనతో తల్లికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం కొన్ని చిత్రాలతో ఈ బ్యూటీ బిజీ బిజీగా ఉంది. గుడ్ లక్ జెర్రీ, మిలీ అనే రెండు సినిమాలు ఒక్కటి స్ట్రీమ్ అవుతుండగా, మరొకటి రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
అవే కాకుండా మరో రెండు ప్రాజెక్టులను చేస్తోంది. తల్లి శ్రేదేవిని పోలిన లుక్స్ తో అభిమానులను అలరిస్తోంది. ఈ భామ. . కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమయంలో చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసింది. దీంతో ఈ అమ్మడు సారీ చెప్పింది.
ఇక ఆ అమ్మడు తల్లి శ్రీదేవి పోలికలను, తన నటనను జోడించి ఎంతో అలరిస్తోంది. శ్రీదేవి లేని లోటు జాన్వీ తీరుస్తుందని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అందాలు ఆరబోయడంలో జాన్వీ ఎప్పూడు ముందే ఉంటుంది. వేరైటీ డ్రెస్ లో తన అందాలను ఆరబోస్తూ యువకుల మతులు పోగోడుతుంది.
ఈ భామ సినిమాలో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉంటుంది. ఆమెకు 16.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటేనే చెప్పొచ్చు ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందనేది. తనకు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగుగెత్తిస్తుంటారు. ఆమె చేసే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైకులు వస్తుంటాయి.
జాన్వీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్న..సోషల్ మీడియా లో తన సినిమాలు, వెకేషన్స్, హాట్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంటుంది.తాజాగా తనకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఆ పిక్ తెగ వైరల్ అవుతోంది. వజ్రాల పొందిగిన గ్రీన్ జాకెట్ ను ధరించిన జాన్వీ అందాల విందు చేసింది. వజ్రాలు పొందిగిన ఆ గ్రీన్ డ్రెస్ లో జాన్వీ.. అతిలోక సుందరిగా కనిపింస్తుంది. మత్తెక్కిచే కంటి చూపులతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటుంది 'జాను మేరీ జాను' అంటూ యువకుల చేత పాటలు పాడేల వారిని తన అందాలతో బంధించింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ సంబంధించిన ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.