విజయ్ దేవరకొండ అనగానే చాలామంది గుర్తొచ్చే నేమ్ రష్మిక. అసలు వీళ్లిద్దరి కాంబినేషన్ ఉంటుంది మాస్టారూ సూపర్, కేక అంతే. కానీ ఏం చేస్తాం రెండు సినిమాలే చేశారు. ఆ తర్వాత అవకాశాలు రాకో, కాంట్రవర్సీ అవుతుందనే తెలీదు గానీ ఇద్దరు కలిసి సినిమాలు చేయడం మానేశారు. కెరీర్ పరంగా మాత్రం ఇద్దరూ కూడా స్టార్స్ అయిపోయారు. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ కాగా, విజయ్.. పాన్ ఇండియా హీరో ఇమేజ్ కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు. క్రేజ్ అయితే ఉంది కానీ సినిమాలే హిట్ కావడం లేదు. అలాంటిది వీరిద్దరూ ఇప్పుడు ఎయిర్ పోర్టులో జంటగా కనిపించి ఆసక్తి పెంచేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ దేవరకొండ, ఒక్కో సినిమా చేసుకుంటూ స్టార్ హోదా దక్కించుకున్నాడు. ఇక విజయ్ కెరీర్ లోనే హైయస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘గీతగోవిందం’. ఇందులో విజయ్ కి జోడీగా చేసిన రష్మిక.. యూత్ కి క్రష్ గా మారిపోయింది. ఇందులో విజయ్-రష్మిక పెయిర్ ని చూసిన వాళ్లందరూ కూడా చూడచక్కని జంట అని కితాబిచ్చేశారు. దీని తర్వాత డియర్ కామ్రేడ్ లోనూ వీళ్లిద్దరూ కలిసి నటించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని రకరకాల పుకార్లు వచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు డిఫెండ్ చేస్తూ వచ్చిన విజయ్-రష్మిక.. తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ కూడా ఇచ్చారు. కానీ ఫ్యాన్స్ ఊరుకోరుగా. ఎప్పుడు ఏదో రూమర్ స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు.
Maldives calling!✈️#RashmikaMandanna and #VijayDeverakonda were snapped leaving for the Maldives at the airport. pic.twitter.com/r6eCdqTCeU
— Filmfare (@filmfare) October 7, 2022
అభిమానులు రూమర్స్ గురించి మాట్లాడుకోవడం సంగతి అటుంచితే.. ఇప్పుడు విజయ్-రష్మిక జంటగా ఎయిర్ పోర్టులో కనిపించారు. వీరిద్దరూ కూడా వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా తాజాగా ‘గుడ్ బై’ ప్రమోషన్స్ లో రష్మికని విజయ్ తో రిలేషన్ గురించి అడిగారు. దీనికి ఫన్నీగా రియాక్ట్ అయిన రష్మిక.. ‘మా మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు చూస్తుంటే క్యూట్ గా ఉంది. ఈ రూమర్స్ మేం పట్టించుకోం. మంచి కథ దొరికితే కలిసి యాక్ట్ చేస్తాం’ అని హుందాగా ఆన్సర్ చెప్పింది. అలా విజయ్ తనకు ఫ్రెండ్ అని చెప్పి.. ఇప్పుడు మాల్దీవులు వెకేషన్ కి వెళ్తుండం గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.