రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే అతడి సినిమాలు కాదు.. హీరోయిన్ రష్మిక గుర్తొస్తుంది. వీళ్ల జోడీ అంతలా పాపులర్ అయింది. చేసినవి రెండు సినిమాలే అయినా కెమిస్ట్రీ నెక్స్ట్ లెవల్లో వర్కౌట్ చేశారు. అదిగో అప్పటి నుంచి సోషల్ మీడియాలో విజయ్ టాపిక్ ఎప్పుడొచ్చినా రష్మిక పేరు… రష్మిక టాపిక్ ఎప్పుడొచ్చినా విజయ్ పేరు రావడం చాలా నార్మల్ అయిపోయింది. దీంతో వీరిద్దరూ కలిసి సినిమాలు చేయలేదు. అలా జరిగిందో.. లేకపోతే కావాలనే చేయట్లేదో తెలీదు. అలాంటి ఈ సమయంలో తాజాగా విజయ్ దేవరకొండతో తన రిలేషన్ పై మరోసారి రష్మిక ఓపెన్ అయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ, స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. పాన్ ఇండియా రేంజ్ లోనూ ఈ మధ్య ‘లైగర్’ని విడుదల చేశాడు. కానీ అనుకున్నంతలా ఆ చిత్రం సక్సెస్ కాలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా నిరాశపరిచింది. మరోవైపు కన్నడ భామ రష్మిక.. తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ దక్కించుకుంది. విజయ్ తో చేసిన ‘గీతగోవిందం’ సినిమా.. రష్మికకు నెక్స్ట్ లెవల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్-రష్మిక.. ‘డియర్ కామ్రేడ్’ అనే పాన్ ఇండియా చిత్రం చేశారు. కానీ దానికి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి.
ఆ తర్వాత ఎవరికి వారు.. తమ తమ ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. ఇదిలా ఉండగా రష్మిక నటించిన తొలి హిందీ మూవీ ‘గుడ్ బై’.. అక్టోబరు 7న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కి వచ్చిన రష్మికకు విజయ్ తో రిలేషన్ షిప్ పై ఓపెన్ అయింది. ‘విజయ్ తో ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు చేశాను. దీంతో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఇప్పుడు అందరూ రష్మిక-విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకోవడం చూస్తుటే ఆనందంగా ఉంది. విజయ్ లైగర్ చిత్రాన్ని ఇటీవల చూశాను. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. లైగర్ చూస్తున్నప్పుడు విజిల్స్ వేస్తూ, డ్యాన్స్ చేశాను. విజయ్ అదరగొట్టేశాడు. వెల్ డన్ విజయ్’ అని రష్మిక చెప్పింది. మరి విజయ్ పై రష్మిక వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్నికామెంట్స్ లో పోస్ట్ చేయండి.