ఆమె నేషనల్ క్రష్. ఆమె స్టెప్పేస్తే చాలు కుర్రాళ్లంతా ఫిదా అయిపోతారు. ఈ మధ్యే ‘సీతారామం’ సినిమాలో హీరోయిన్ గా కాకుండా కథకు అవసరమైన కీలకపాత్రలో నటించి మెప్పించింది. గతేడాది చివర్లో ‘సామీ సామీ’ అని యూట్యూబ్ మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. ఎవరో అర్ధమైందనుకుంటా.. యస్ మేం చెబుతున్నది హీరోయిన్ రష్మిక గురించే. ఆమె హాస్పిటల్ లో చేరడం, ఓ డాక్టర్ ఆమెతో ఉన్న ఫొటో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కన్నడలో ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతో రష్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఛలో’ మూవీతో తెలుగునాట అడుగుపెట్టింది. ఇక అక్కడ నుంచి మెల్లమెల్లగా సినిమాలు చేసుకుంటూ హీరోయిన్ కాస్త స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప’ తొలి పార్ట్ లో శ్రీవల్లి అనే డీ గ్లామర్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. ఇందులో సామీ సామీ పాటకు ఆమె వేసిన స్టెప్పులు, ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అంతలా పాపులర్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ గానూ పేరు సంపాదించింది.
తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ హీరోయిన్ రష్మిక బిజీగా మారిపోయింది. ఇలా ఫుల్ బిజీగా ఉన్న రష్మిక.. సడన్ గా ఆస్పత్రిలో కనిపించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. ఏం జరిగిందా అని తెలుసుకోవాలని చూశారు. ఈ క్రమంలో ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ గురువారెడ్డిని రష్మిక తాజాగా కలిసినట్లు తెలింది. ఆయనే ఈ విషయాన్ని చెబుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. మోకాళ్ల నొప్పితో బాధపడుతూ రష్మిక, తన దగ్గరకు వచ్చిందని పెద్దగా భయపడాల్సింది ఏం లేదని చెప్పుకొచ్చారు.
‘”నువ్వు ‘సామి..సామి..’ అంటూ మోకాళ్ళ మీద బరువంతా వేసి డాన్స్ చెయ్యడం వల్లే ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి!” అని
మోకాలి నొప్పి అంటూ నా దెగ్గరకు వచ్చిన ‘శ్రీవల్లి’కి సరదాగా పెదవి విరుస్తూ ఇలా అన్నాను. పుష్ప సినిమా చుసిన మొదలు, రష్మికని కలిసి అభినందించాలనుకున్న నాకు.. ఆమె మోకాలి నొప్పి ద్వారా ఆ సందర్భం వచ్చింది! బన్నీ కూడా త్వరలో షోల్డర్ పెయిన్(భుజం నొప్పి)తో వస్తాడు ఏమో..’ అని సదరు డాక్టర్ ఫన్నీగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. మరి రష్మిక, హాస్పిటల్ లో చేరడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: డాన్స్ తో మనసు దోచుకున్న చిన్నారి! ఎలాగైనా ఆ పాపను కలవాలంటూ రష్మిక ట్వీట్!
ఇదీ చదవండి: రాజకీయాల్లోకి హీరోయిన్ రష్మిక! MP కూడా అవుతుందా..?