రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందాన్ని కాపాడుకోవాలి, కథలు వినాలి, ప్రాజెక్ట్స్ మీద సైన్ చేయాలి, సినిమాకి తగ్గట్టు తనను తాను మలచుకోవాలి.. ఒకటా రెండా ఇలా ఎన్నో పనులు ఉన్నాయి ఈ బ్యూటీకి. ఇన్ని పనులతో సతమతమవుతున్నప్పుడు వేరే వాటి గురించి ఆలోచించడానికి టైం ఎక్కడుతుంది చెప్పండి. కానీ ప్రముఖ జ్యోతిష్యుడైన వేణు స్వామి మాత్రం రష్మిక త్వరలోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఏకంగా ఎంపీ అవుతుందని ఆయన అంటున్నారు. సెలబ్రిటీల ఫేస్ చూసి ఫ్లాష్ బ్యాక్ తో పాటు ఫ్యూచర్ చెప్పేసే వేణు స్వామి.. ఎంత ఫేమస్సో మనకి తెలిసిందే. సెలబ్రిటీల జాతకం చూసి వాళ్ళ జీవితాల్లో జరగబోయే సంఘటనలను ముందుగానే ఊహించి చెప్పడం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. మొదట్లో ఆయన్ని వ్యతిరేకించిన వారు కూడా ఆయన చెప్పేవి జరుగుతుండడంతో ఇప్పుడు అభిమానించడం మొదలుపెట్టారు. గతంలో కొందరి సెలబ్రిటీల జాతకం గురించి వేణు స్వామి చెప్పినవి నిజం అవ్వడంతో ఆయన పట్ల అభిప్రాయాన్ని మార్చుకున్నారు. దీంతో ఇప్పుడు ఈయన చెప్పే జాతకానికి భలే గిరాకీ ఏర్పడింది.
తాజాగా ఆయన రష్మిక మందన్న కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది హైదరాబాద్ లోని రష్మిక నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేణు స్వామి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక కెరీర్ గురించి మాట్లాడారు. రష్మిక జాతకం బాలేదని, రక్షిత్ శెట్టిని వదిలేయమని చెప్పింది నేనే అని వేణు స్వామి అనడంతో రష్మిక వదిలేసిందని అన్నారు. ఆ తర్వాత ప్రత్యేక పూజ చేశానని, ఆమె కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళ్తుందని, పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందని, లోక్ సభ ఎంపీ అవుతుందని ఆమెకు చెప్పినట్లు గుర్తు చేశారు. కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభ ఎంపీ అయ్యే యోగం రష్మికకు ఉందని వెల్లడించారు. దీంతో వేణు స్వామి వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన చెప్పేవన్నీ జరుగుతున్నాయని, తమ అభిమాన హీరోయిన్ కూడా రాజకీయాల్లో చక్రం తిప్పుతుందని అభిమానులు మురిసిపోతున్నారు. మరి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఒకే సినిమాలో బావ బామ్మర్ది పాత్రల్లో మెగా, నందమూరి హీరోలు?
ఇది కూడా చదవండి: Anupama Parameswaran: తొలిసారి గ్లామర్ షోతో రెచ్చిపోయిన అనుపమ!