సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ సెలబ్రిటీలు తమ ఫ్యాన్స్ ని రీచ్ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది. సోషల్ మీడియా ద్వారా ఓ పాప చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ చూసి హీరోయిన్ రష్మిక మందాన ఫిదా అయిపోయింది. ఎలాగైనా ఆ పాపను కలవాలని ఉందంటూ ట్విట్టర్ లో ట్వీట్ పెట్టడమే కాకుండా.. ఆ పాప డాన్స్ వీడియో కూడా పోస్ట్ చేసింది రష్మిక. పుష్ప సినిమా సాంగ్స్ ఏ స్థాయిలో ఆదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల పుష్ప ఆల్బమ్ ఇండియన్ రికార్డులను కూడా బ్రేక్ చేసింది. అయితే.. పుష్ప సినిమాకు అంతటి క్రేజ్ రావడానికి సినిమాలోని పాటలు కూడా ప్రధాన కారణం.
ఇక పుష్పలోని అన్ని పాటలకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్స్ పాపులర్ అయిపోయారు. ఇప్పుడున్న ట్రెండ్ ని ఫాలో అవుతూ.. ఓ మూడేళ్ళ చిన్నారి స్కూల్ యూనిఫామ్ లో ‘సామీ సామీ’ పాటకు డాన్స్ చేసింది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ చిన్నారి చేసిన మాస్ డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అది కాస్త హీరోయిన్ రష్మిక కంట్లో పడింది. ఇక ఆ చిన్నారి డాన్స్ చూసిన రష్మిక.. వెంటనే ఆ క్యూట్ నెస్ కి ఫ్యాన్ అయిపోయి, వెంటనే ఆ పాపను కలవాలని ఉందంటూ ట్వీట్ చేసింది. అలాగే ఆ పాపను కలవడం ఎలాగో చెబుతారా? అంటూ ట్వీట్ లో అడిగింది. దీంతో కామెంట్స్ లో అందరూ ఆ పాప నేపాల్ కి చెందిందని చెబుతున్నారు. మరి ప్రస్తుతం ఆ పాప వీడియో నెట్టింట తెగవైరల్ అవుతోంది. మరి చుటే పాప డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Maaaaadddddeeeeee myyyyy daaaaaay.. I want to meet this cutie..💘
how can I? 🥹 https://t.co/RxJXWzPlsK— Rashmika Mandanna (@iamRashmika) September 14, 2022