Nagarjuna: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తోంది. బాయ్ కాట్ ట్రెండ్ కారణంగా పలు సినిమాలు ప్లాప్‌గా నిలిచాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అమీర్ ఖాన్ గతంలో భారత్‌పై చేసిన వ్యాఖ్యల కారణంగా ‘ బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా’ ట్రెండ్ అయింది. ఈ ట్రెండ్ ప్రేక్షకుల మీద ఎంత మేరకు ప్రభావం చూపిందో తెలియదు కానీ, ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. తర్వాత వచ్చిన రక్షా బంధన్, లైగర్ సినిమాలపై కూడా బాయ్ కాట్ ట్రెండ్ అయింది. ఆ సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. హీందీలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని అందుకున్నాయి. వాటిలో గంగుభాయ్ కతియా వాడి, కాశ్మీరీ ఫైల్స్, భూల్ భులైయా 2 సినిమాలు బాక్సా ఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి.
చాలా సినిమా బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య ‘బ్రహ్మాస్త్ర’ థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు కూడా బాయ్ కాట్ ట్రెండ్ అయింది. ఇందుకు కారణం లేకపోలేదు. భారత్‌లో ఉండటం గురించి ఆలియా తల్లి గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. రణ్‌బీర్‌కు బీఫ్ సెగ పట్టుకుంది. ఈ కారణాలతో ‘బ్రహ్మాస్త్రపై బాయ్ కాట్ ట్రెండ్ అయింది. అయితే, ఈ ట్రెండ్ సినిమాను ఏమీ చేయలేకపోయింది. మిక్స్డ్ టాక్ వచ్చినా సినిమా మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బాయ్ కాట్ ట్రెండ్‌పై నాగార్జున స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘గంగు భాయ్ కతియా వాడి, భూల్ భులయా 2, ఆర్ఆర్ఆర్ సినిమాలు మంచి కంటెంట్ ఉండటం కారణంగానే బాగా ఆడాయి. లాల్ సింగ్ చద్దా ఆడలేదు కానీ, బ్రహ్మాస్త్ర బాగా ఆడుతోంది. బాయ్ కాట్ ట్రెండ్ సినిమా పరిశ్రమను పెద్దగా ప్రభావితం చేయలేదు. సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రెండ్ చేసినంత మాత్రాన మంచి సినిమాను విజయం సాధించకుండా ఆపలేము. బాయ్ కాట్ అనేది మ్యాటర్ కాదు.. మంచి కంటెంట్ మాత్రమే మ్యాటర్. ఇది చాలా హిందీ, తెలుగు సినిమాలు నిరూపించాయి’’ అని అన్నారు. మరి, నాగార్జున బాయ్ కాట్ ట్రెండ్‌పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పోలీస్ విచారణకి హాజరైన స్టార్ హీరోయిన్! కారణం?