రష్మిక మందన్నా.. ఈ పేరుకు ఇప్పుడు మాములు క్రేజ్ లేదు. ఎంతలా అంటే.. నేషనల్ క్రష్‌లా మారింది రష్మిక. కిరిక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఛలో ఆమె నటించిన తొలి చిత్రం. ఇక ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ.. కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ-రష్మిక కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. గీత గోవిందం, డియర్ కామ్రెడ్ చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. తాజాగా తెలుగులో పుష్ప చిత్రంలో నటించింది. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌తో బిజీగా ఉంది. ఇటు సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతూనే.. బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది రష్మిక. అక్కడ కూడా వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం గుడ్ బై తర్వలోనే విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది రష్మిక. ఈ సందర్భంగా తన జీవితంలో చోటు చేసుకున్న ఓ భయానక అనుభవం గురించి చెప్పుకొచ్చింది.
డియర్ కామ్రెడ్ సినిమాలో రష్మిక-విజయ్ మధ్య లిప్‌లాక్ సీన్ ఉంది. అప్పట్లో ఈ సన్నివేశంలో నటించడం వల్ల రష్మికపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. నాటి అనుభవాల గురించి రష్మిక తాజాగా స్పందించింది. ‘‘ఆ రోజులను నేను ఎప్పటికి మర్చిపోలేను. ఆ సీన్‌పై వస్తున్న ట్రోల్స్ ఎలా అధిగమించానో.. ఆ బాధ నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికి అర్థం కావడం లేదు. నేను చాలా సెన్సిటీవ్ పర్సన్‌ని. దాంతో విమర్శలని తట్టుకోలేకపోయేదాన్ని’’ అని చెప్పుకొచ్చింది.
‘‘కొందరు నాకు ఫోన్ చేసి అంతా బాగానే ఉంది.. ఏం కాదు అని చెప్పేవారు. మరి కొందరు మాత్రం.. నన్ను దారుణంగా విమర్శించారు. ఆ సమయంలో నన్ను తీవ్రంగా బాధించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పీడకలలు వేధించేవి. నేను ఎవరినో వేడుకుంటున్నట్లు.. కలలు వచ్చేవి. అందరు నన్ను దూరం పెడుతున్నట్లు.. అనిపించేది. అలాంటి కలలు వస్తే.. వెంటనే ఉలిక్కిపడి నిద్ర లేచేదాన్ని. రాత్రంతా ఏడుస్తూ ఉండేదాన్ని’’ అంటూ తాను ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి వివరించింది రష్మిక.
ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె నటించిన గుడ్ బై సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఈ సినిమాలో నటిస్తుంది రష్మిక. ఇదే కాక.. సిద్దార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను, రణబీర్ కపూర్ జంటగా యానిమల్ చిత్రాల్లో నటిస్తోంది రష్మిక.