లైగర్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా నటుడిగా తానేంటో నిరూపించుకున్నారు విజయ్ దేవరకొండ. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. రీసెంట్ గా విజయ్ పై క్రష్ ఉందంటూ జాన్వీ కపూర్, సారా అలీఖాన్, కియారా అద్వానీ వంటి సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీనికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా జాన్వీ కపూర్ విజయ్ పై మరోసారి వ్యాఖ్యలు చేసింది. జాన్వీ కపూర్ నటించిన ‘మిలి’ సినిమా నవంబర్ 4న విడుదల అవుతున్న సందర్భంగా ఆమె ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఒకవేళ మీకు స్వయంవరం జరిగితే.. ఆ స్వయంవరంలో ఏ హీరోలు ఉంటే బాగుంటుందనుకుంటున్నారని సదరు యాంకర్ అడగ్గా.. తన స్వయంవరంలో హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, టైగర్ ష్రాఫ్ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది. రణబీర్ కపూర్ కి పెళ్లయింది కాబట్టి వేరే పేరు చెప్పండి అని అడగ్గా.. ఆమె ఆలోచించడం మొదలు పెట్టింది. వెంటనే యాంకర్.. విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించాడు. దానికి జాన్వీ కపూర్.. అతనికి ప్రాక్టికల్ గా పెళ్లి అయిపోయిందంటూ కామెంట్స్ చేసింది. ఆ ఒక్క మాటతో నెటిజన్లు జేబులో చేతులు పెట్టుకుని.. ఊహాగానాల లోకంలోకి వెళ్లిపోయారు. రష్మిక మందన్నా, విజయ్ రిలేషన్ షిప్ గురించే జాన్వీ కపూర్ కామెంట్స్ చేసిందని అభిప్రాయానికొచ్చేసింది బాలీవుడ్ మీడియా.
విజయ్, రష్మిక ఎయిర్ పోర్ట్ లో కనబడడం, ఇద్దరూ కలిసి మాల్దీవులకు వెళ్లడం, ఆ తర్వాత మాల్దీవుల నుంచి తిరిగొచ్చిన వీడియో వైరల్ అవ్వడం, విజయ్.. రక్షిత్ లా ఇన్ సెక్యూర్ కాదని రష్మిక కామెంట్స్ చేయడం ఇవన్నీ చూసిన జనం ఇద్దరి మధ్యన లవ్ ఫాగ్ నడుస్తోందని వార్తలు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ వార్తలకు జాన్వీ కపూర్ కామెంట్స్ బలం చేకూర్చాయి. విజయ్ కి ప్రాక్టికల్ గా పెళ్లి అయిపోయిందని జాన్వీ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయ్ అంటే జాన్వీ కపూర్ కి ఇష్టమే.. కానీ విజయ్ రష్మికతో తిరుగుతుండడం వల్ల తనకి ఛాన్స్ లేదని ఇన్ డైరెక్ట్ గా ఆమె వెల్లడించింది. ఇదిలా ఉంటే తెలుగులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా చేయాలని కోరికగా ఉందని ఆమె వెల్లడించింది. అదన్న మాట విషయం.