సాధారణంగా ఒకే సినిమాలలో కలిసి నటించిన కొంతమంది హీరోహీరోయిన్స్ ఫ్రెండ్ షిప్, డేటింగ్, లవ్ చేసుకోవడం చూస్తుంటాం. అయితే.. ఈ విషయాన్ని కొందరు బయటకి చెప్పేస్తుంటారు.. మరికొందరు కొంతకాలంపాటు దాచి ఆ తర్వాత ఏదోకటి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కానీ.. ఒక సినిమాలో కలిసి నటించిన హీరో, హీరోయిన్.. ఆ సినిమా తర్వాత కూడా కలిసి తిరగడం, పార్టీలకు వెళ్లడం.. బీచ్ లకు, టూర్లు ఇలా ప్రతిచోటా కలిసే కెమెరా కంటపడటం అనేది ఎప్పుడైనా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగానే మారుతుంది. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన కలిసి మాల్దీవులకు వెళ్లిన విషయం కూడా ఇలాగే చర్చలకు దారితీసింది.
ఎందుకంటే.. అంతలా కలిసే తిరిగేవారు బయటికి చెప్పేసి ధైర్యంగా తిరగవచ్చు కదా.. అలా దాక్కొని సీక్రెట్ గా కలవడం, వార్తల్లో నిలవడం ఎందుకని అంటుంటారు. ఒకవేళ విజయ్, రష్మిక విడివిడిగా వెళ్లినప్పటికీ.. మాల్దీవ్స్ లో ఫోటోలు దిగి పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే.. విజయ్, రష్మిక ఇద్దరూ మాల్దీవుల నుండి ఇండియాకి తిరిగివచ్చిన వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎయిర్ పోర్టులో నుండి బయటికి వస్తున్న వీడియో వైరల్ అవుతుండగా.. విజయ్, రష్మిక ఇద్దరూ ఎవరికి వారే సపరేట్ గా బయటికి రావడం మనం వీడియోలో చూడవచ్చు.
గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో కలిసి నటించిన విజయ్, రష్మిక.. ఆ సినిమాల టైంలోనే బాగా క్లోజ్ అయిపోయారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని చెబుతూ వస్తున్నారు. కానీ.. వీరు కెమెరా కంటపడిన సందర్భాలు, ప్లేసులు.. వీరి మధ్య స్నేహం కాదు ఇంకేదో ఉందనే అనుమానాలు క్రియేట్ చేశాయి. ముందుగా రూమర్స్ అనుకున్నా.. వీరిద్దరూ కలిసి తిరగడం, బీచులు, పార్టీలకు వెళ్లడం గురించి తెలిసేసరికి జనాలలో ఉన్న అనుమానాలు బలపడ్డాయి. ఇదిలా ఉండగా.. విజయ్, రష్మిక మాల్దీవ్స్ నుండి ఇండియాకి తిరిగి వచ్చిన ఎయిర్ పోర్టు వీడియో చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. చూడాలి మరి త్వరలో ఇద్దరూ ఏదైనా గుడ్ న్యూస్ చెబుతారేమో!