ఇటీవల కాలంలో థియేట్రికల్ రిలీజైన సినిమాలన్నీ డిజిటల్ ప్లాట్ ఫాములు అందుబాటులో ఉండేసరికి వరుసగా క్యూ కడుతున్నాయి. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను నిరాశకు గురిచేసిన సినిమాలు త్వరగా ఓటిటిలోకి వస్తున్నాయంటే ఓకే అనుకోవచ్చు. కానీ.. బోజ్క్సఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సినిమాలు కూడా నెలరోజులు పూర్తవకుండానే ఓటిటిలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుండటం గమనార్హం. మామూలు థియేటర్స్ లో విడుదలైన సినిమాలు.. ఓటిటిలోకి రావడానికి గ్యాప్ తీసుకుంటే జనాలకు చూసే ఇంటరెస్ట్ పోతుందని అంటుంటారు. అందుకే ఊపులో ఉన్నప్పుడే ఓటిటిలో కూడా రిలీజ్ చేసేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ విధంగా సెప్టెంబర్ లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న తమిళ డబ్బింగ్ చిత్రం ఓటిటి రిలీజ్ ఖరారు చేసుకుంది. స్టార్ హీరో శింబు నటించిన ‘వందు తునిందదు కాడు’ చిత్రం.. తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో సెప్టెంబర్ 15న థియేటర్స్ లో విడుదలైంది. అగ్రదర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ సినిమా.. తమిళ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. వెనుకాముందు ఏమి లేని ఓ నిరుపేద వ్యక్తి.. లైఫ్ లో ఎలా ఎదిగాడు? అనే కథాంశంతో ఈ లైఫ్ ఆఫ్ ముత్తు తెరపైకి వచ్చింది. ఇక మొత్తం మూడు భాగాలుగా అనౌన్స్ చేసిన ఈ సినిమా.. ప్రస్తుతం రెండో పార్ట్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో సిద్ధి ఇద్నాని హీరోయిన్ గా నటించింది.
చాలా రోజుల తర్వాత డైరెక్టర్ గౌతమ్ మీనన్.. లైఫ్ ఆఫ్ ముత్తు మూవీతో ట్రాక్ లోకి వచ్చాడని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. విడుదలై నెల రోజులు గడవకముందే ముత్తు మూవీ ఓటిటి రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా.. అక్టోబర్ 13 నుండి ఓటిటి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది అమెజాన్ ప్రైమ్. అయితే.. ప్రస్తుతం తమిళ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి రానుందని టాక్. ఇక వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ఇషారి కే గణేష్ నిర్మించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. చూడాలి మరి లైఫ్ ఆఫ్ ముత్తు ఓటిటిలో ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో!
take an unvarnished look at the gangster world #VendhuThanindhathuKaaduOnPrime, Oct 13 pic.twitter.com/kixtugRSqV
— prime video IN (@PrimeVideoIN) October 11, 2022