రష్మిక మందన్నా ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. పుష్ప సినిమాతో హిందీలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడ కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. రష్మిక మందన్నా ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అయితే, కొన్ని అనుకోని కారణాల వల్ల ఇద్దరూ ఎంగేజ్‌మెంట్‌తో పాటు ప్రేమకు కూడా బ్రేకప్ చెప్పేశారు. ఆ తర్వాత ఎవరికి వాళ్లు సినిమాల్లో బిజీ అయ్యారు. అయితే, రక్షిత్ శెట్టితో బ్రేకప్ తర్వాత రష్మిక తన కో స్టార్, తెలుగు హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో పడిందన్న ప్రచారం చాలా ఏళ్లుగా జరుగుతూ వస్తోంది. అయితే, వారిద్దరి ప్రేమ నిజం అన్న వార్తలు కూడా వస్తున్నాయి.
ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ న్యూస్ 18 ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో… 2020లో రష్మిక మందన్నా ఇంటర్ నేషనల్ బిజినెస్ టైమ్స్, టైమ్స్ నౌలకు వేరు వేరుగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆమె మాట్లాడుతూ.. రక్షిత్ శెట్టితో విడిపోయిన తర్వాత బాధలో ఉన్న తనకు విజయ్ ఎంతో ఓదార్పునిచ్చాడని, కేర్ చూపించాడని చెప్పిందట. తన కోసం ఈ ప్రపంచం ఎదురుచూస్తోందన్న విషయం విజయ్ ద్వారానే రష్మిక అర్థం చేసుకుందట. విజయ్ తన ప్రపంచంలో తాను చాలా సింపుల్‌గా జీవిస్తాడట. గీతా గోవిందం సమయంలో విజయ్, రష్మికల మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉండేదట. కానీ, విజయ్‌పై రష్మికకు ఏదో తెలియని భావన ఉండేదట.
విజయ్ చాలా స్పెషల్ అంటూ ఎల్లప్పుడూ ఆమె మనసు చెప్పేదట. డియర్ కామ్రెడ్ షూటింగ్ టైంలో రష్మికకు తాను విజయ్‌ని ప్రేమిస్తున్నానని అర్థం అయిందట. ఒకనొక సమయంలో ఆమె తన ప్రేమను విజయ్‌కి చెప్పిందట. మొదట అతడు వద్దన్నా తర్వాత ఆమె ప్రేమను అంగీకరించాడట. తన మాజీ ప్రియుడు రక్షిత్ లాగా విజయ్ ఇన్‌సెక్యూర్ కాదని, చాలా ఫ్రీ మైండెడ్ అని చెప్పిందట. తనను పెళ్లి తర్వాత సినిమా కెరీర్‌ను వదులకోమని చెప్పకుండా.. విజయ్ పూర్తి స్వాతంత్రం ఇచ్చాడట. కాగా, కొద్దిరోజుల క్రితం విజయ్ దేవర కొండ, రష్మిక మందన్నా ఇద్దరూ ఒకేరోజు వేరువేరుగా మాల్దీవ్స్ టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు వెకేషన్‌లో గడిపిన ఇద్దరూ ఒకేసారి వేరువేరుగా ఇండియాకు తిరిగి వచ్చారు.