పెళ్లి అంటే పెద్ద పండగ. చేసుకునేవారికి కాదు, చూసేవారికి కూడా పండగే. సంక్రాంతి, దసరా పండుగల్లానే ఈ పెళ్లి వేడుక కూడా జరుగుతుంది. పెళ్లి వేడుకల్లో బరాత్ అనేది బాగా ట్రెండ్ అయిపోయింది. బరాత్ లో తీన్మార్ డ్యాన్స్ చేయడం ఇప్పుడు నయా ట్రెండ్. ఈ క్రమంలో సెలబ్రిటీలు కూడా తగ్గేదేలే అన్నట్టు బరాత్ లలో తీన్మార్ స్టెప్పులతో అలరిస్తున్నారు. ఆ మధ్య సోదరి పెళ్లి వేడుకలో నటి ప్రగతి తీన్మార్ డ్యాన్స్ చేసి అలరించారు. పెళ్లి బరాత్ లో పూనకాలు వచ్చినట్టు ఓ రేంజ్ లో మాస్ స్టెప్పులు వేశారు. తాజాగా నటి, యాంకర్ వర్షిణి కూడా తన ఫ్రెండ్ పెళ్లి బరాత్ లో ఊర మాస్ బీట్స్ తో తీన్మార్ డ్యాన్స్ చేశారు.
భీమ్లా నాయక్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించి మెప్పించిన మౌనిక రెడ్డి.. వివాహం గ్రాండ్ గా జరిగింది. గ్రాండ్ గా గోవాలో రెండు రోజుల పాటు మౌనిక వివాహం జరిగింది. సందీప్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. రెండు రోజుల పాటు గోవాలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ ని ప్లాన్ చేసుకున్నారు. గోవా బీచ్ లో ఈ పెళ్లి వేడుక జరిగింది. డిసెంబర్ 17న ఉదయం 11 గంటలకు హల్దీ ఫంక్షన్ జరుగగా.. డిసెంబర్ 18న 11.39 నిమిషాలకు వీరి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు యాంకర్, నటి వర్షిణి కూడా హాజరయ్యారు.
మౌనిక క్లోజ్ ఫ్రెండ్ కావడంతో వర్షిణి.. పెళ్లి వేడుకలో సందడి చేశారు. చీర కట్టుకుని పెళ్లి కూతురులా ముస్తాబై బీచ్ ఒడ్డున మండపంలో సందడి చేశారు. వర్షిణియే పెళ్లి కూతురేమో అనేంతగా ఆకట్టుకున్నారు. అంతేకాదు బారాత్ లో డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు. మౌనికను కూడా తనతో పాటు డ్యాన్స్ చేయిస్తూ చిందులు వేశారు. డోలు శబ్దాలకు మాస్ స్టెప్స్ తో తీన్మార్ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
wedding scenes ❤️🔥#varshinisounderajan #varshini pic.twitter.com/Bivo2Vzmjr
— Varshini Sounderajan (@anchorvarshini) December 19, 2022
#varshinisounderajan #varshini 💃 pic.twitter.com/NJPds9wgbF
— Varshini Sounderajan (@anchorvarshini) December 17, 2022