టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి.. జీవితాన్ని చాలా క్యాజువల్ గా తీసుకుంటారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకుని.. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి హాస్పిటల్స్ కి, డాక్టర్స్ కి డబ్బులు తగలేయడం కంటే.. ఉన్నది ఒక్కటే జిందగీ, ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలి అని చేసే పనుల ద్వారా ఒక రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. నటిగానే కాకుండా.. అందం, ఆరోగ్యంలో కూడా ప్రగతి చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఫిట్ నెస్ విషయంలో హీరోయిన్స్ తో పోటీ పడి మరీ గంటలు గంటలు వర్కవుట్లు చేస్తుంటారు. డైలీ వర్కవుట్లు చేయడం ఒక వ్యసనంగా మారిపోయింది. ఈ వయసులో ఆమె ఇలా శారీరక శ్రమ చేయడం, వ్యాయామాలు చేయడం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా వీడియోలు షేర్ చేస్తుంటారు.
తాజాగా ఆమె ఒక వీడియోని షేర్ చేశారు. తన చెల్లెలి పెళ్ళిలో పూనకం మాస్ డాన్స్ చేశారు. పెళ్లి అంటే డప్పులు, మంగళ వాయిద్యాలు ఆ సందడి ఎలాగూ ఉంటుంది. డప్పులు వాయిస్తుంటే.. శరీరంలో పూనకాలు మొదలైపోతాయి. ఒంట్లో పట్టు పోయి, పళ్లూడిపోయిన వృద్ధులే ఆ డప్పు శబ్దాలకి పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. అలాంటిది హైపర్ యాక్టివ్ పర్సన్ అయిన ప్రగతికి పూనకం రాకుండా ఉంటుందా? ఆమె కూడా అందరిలానే పూనకం వచ్చినట్టు ఊగిపోయారు.
సామాన్యుల ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు.. డప్పు సౌండ్లకి ఎలా అయితే స్టెప్పులు వేస్తారో.. అలానే నటి ప్రగతి కూడా శరీరాన్ని ఊపుతూ రచ్చ చేశారు. ఆమె చెల్లి పెళ్లి కావడంతో బరాత్ లో డోలు మీద కూర్చుని తీన్మార్ డాన్స్ చేశారు. హొయ్ హొయ్ అంటూ అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి.. “నా చెల్లి పెళ్లి. అందుకే సైలెంట్ గా ఉండలేకపోయాను. పిచ్చిని ప్రవహించనివ్వండి” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.