వర్షిణితో హైపర్ ఆది పెళ్లి జరగబోతుందా? నిజమేనా? ఈ వార్తలపై యాంకర్ వర్షిణి ఏమంటుంది?
జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ఆది. ఎంతో మంది కమెడియన్స్ లో ఆది ఒకరు. తను చేసే స్కిట్స్ కి మిలియన్లలో వ్యూస్ వస్తాయి. ఇప్పుడున్న బుల్లితెర కమెడియన్స్ లో ఆది ముందు వరుసలో ఉంటారు. టైమింగ్ తో పంచులు వేయడం ఆదికి వెన్నతో పెట్టిన విద్య లాంటిది. కేవలం తన పంచులతోనే స్కిట్ ను నిలబెట్టగల కెపాసిటీ ఉన్న కమెడియన్ ఆది. ప్రస్తుతం ఎప్పుడు లేనంత బిజీగా గడిపేస్తున్నాడు. ఒక పక్క టీవీ షోస్ చేస్తూనే.. మరో పక్క సినిమాలకు రచయితగా, ఇంకో పక్క జనసేన ప్రచార కార్యకర్తగా ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అయితే.. ఆది ఒ యాంకర్ వర్షిణితో ప్రేమలో ఉన్నాడనే వార్త ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇదే విషయంపై యాంకర్ వర్షిణి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, బుల్లితెర జనాలకు దగ్గరైన నటి వర్షిణి. ప్రస్తుతం ఆమె యాంకర్ గా పలు టీవీ షోస్ చేస్తూ.. ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే “ఆది” గత కొన్నేళ్లుగా ఒక యాంకర్ తో ప్రేమలో ఉన్నాడని, ఆ యాంకర్ వర్షిణి అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి “ఢీ” అనే ప్రోగ్రాంలో చేశారు. అంతే కాకుండా కొన్ని ఈవెంట్స్ కూడా చేశారు. దీంతో వీరి మధ్య ప్రేమ ఏర్పడిందని, అది కాస్త పెళ్లికి దారితీసిందని నెటిజన్లు అనుకుంటున్నారు. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
దీనిపై ఆది స్పందించక పోగా.. వర్షిణి మాత్రం వీలు చిక్కినప్పుడల్లా ఈ విషయాన్ని ఖండిస్తూనే వస్తుంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి వార్తలపై వస్తున్న ప్రచారాన్ని ఖండించింది. పెళ్లి విషయం పూర్తిగా మా అమ్మానాన్నలకు వదిలేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ నిర్వహించగా అందులో కూడా పలువురు నెటిజన్లు పెళ్లి ప్రస్తావన గురించి అడిగారు. దీంతో తను మాట్లాడుతూ.. “మేమిద్దరం మంచి స్నేహితులం, మా మధ్య ప్రేమ లాంటివి లేవు” అంటూ.. చెప్పుకొచ్చింది. దీంతో ఆది, వర్షిణి మధ్య ప్రేమ లేదనే విషయం పై క్లారిటీ వచ్చింది.