హీరో అక్కినేని నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయిన’ . ఈ సినిమాలో రెండు పాత్రల్లో నాగార్జున నటించి అలరించారు. అయితే ఈ సినిమాకు రెండో భాగంగా ‘బంగార్రాజు’ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాతకు, మనవడికి మధ్య ఉన్న అనుబంధాలను చెప్పేదిగా ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాత పాత్రలో నాగార్జున, మనవడి పాత్రలో ఆయన రెండో తనయుడు అఖిల్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మనవడి పాత్రకు మొదట నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యను తీసుకోవాలని భావించారట. చైతన్య కంటే అఖిల్ ఈ పాత్రకు బాగుంటాడనే కారణంతో అతడినే మనవడి పాత్రకు తీసుకోవాలని నిర్ణయించారని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు రావాల్సి ఉండగా, ఎప్పటికప్పుడు పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.
చాలా రోజుల పాటు ఈ మూవీ స్క్రిప్ట్ పనులపై కసరత్తులు చేసిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను జులైలో సెట్స్ పైకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున జోడీగా రమ్యకృష్ణ నటించనుండగా నాగార్జున తనయుడు నాగ చైతన్య ఓ ముఖ్యపాత్ర పోషించబోతున్నారు. చైతూ రోల్ కొంతసేపే ఉంటుందట కానీ అఖిల్‌కి స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఇవ్వబోతున్నారట. తాత- మనవడిగా… నాగార్జున- అఖిల్ పర్‌ఫార్‌మెన్స్ పీక్స్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల. కథ అంతా కూడా నాగ్- అఖిల్ మధ్యే నడిచేలా బలమైన స్క్రిప్ట్ రెడీ చేశారని తెలిసింది.