తెలుగులో తమకంటూ.. ప్రత్యేక గుర్తింపు పొందిన నటీమణుల్లో రమ్యకృష్ణ ఒకరు. అందం, నటన కలగలిపిన నటీ రమ్యకృష్ణ అనేక చిత్రాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
తెలుగులో తమకంటూ.. ప్రత్యేక గుర్తింపు పొందిన నటీమణుల్లో రమ్యకృష్ణ ఒకరు. అందం, నటన కలగలిపిన నటీ రమ్యకృష్ణ అనేక చిత్రాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. “నరసింహ” సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో కూడా ఒకటనే సంగతి తెలిసిందే. కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సౌందర్య ఈ సినిమాలో హీరోయిన్ రోల్ నటించగా రమ్యకృష్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. రమ్యకృష్ణ చేసిన పాత్రల్లో “నరసింహ” సినిమాలోని నీలాంబరి పాత్ర కూడా ఒకటి కావడం విశేషం. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ, సౌందర్య ముఖంపై కాలు పెట్టే సీన్ ఉంటుంది. ఈ సీన్‌కు సంబంధించి ఎన్నో రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ అవ్వని వట్టి అబద్దాలని డైరెక్టర్ కే ఎస్ రవికుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
అయితే నరసింహ సినిమాలోని ఓ ఆస్తికర సన్నివేశం ఫ్యాన్స్‌కు ఇప్పటీకి గుర్తు ఉంటుంది. ఈ మూవీలో సౌందర్యను రజనీకాంత్ ఇష్టపడుతు ఉంటాడు. మరో వైపు రజనీని రమ్యకృష్ణ ప్రేమిస్తు ఉంటుంది. కానీ రజనీకాంత్ సౌందర్యను పెళ్లి చేసుకుంటాడు. దీంతో సౌందర్యపై శత్రుత్వం పెరుగుతుంది. అదే సమయంలో ఇద్దరి మధ్య ఓ అసక్తికర సన్నివేశం చోటు చేసుకుంటుంది. అ సీన్ లో సౌందర్య చెంపపై రమ్యకృష్ణ తన పాదం ఉంచి అమెను ఉద్దేశించి కామెంట్స్ చేసింది. అయితే అ సందర్బంలో అలా నటించేందుకు చాలా కష్టంగా అనిపించిందని ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.
రమ్యకృష్ణ మాట్లాడుతూ.. అ చిత్రంలో నా రోల్ సౌందర్యపై పగ తీర్యుకోవడం. అందుకే అలాంటి అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కానీ మొదట ఆ సీన్ చేయలేకపోయాను. కానీ డైరెక్టర్ రవికుమార్ ఈ సీన్ చాలా అవసరం అని చెప్పారు. దీంతో చేసేది ఏం లేక అ షాట్ చేశాను. దానీకి ముందు దేవుళ్లను మనసులో తలుచుకున్న. అ తర్వాతే సౌందర్య చెంపపై కాలు పెట్టాను. షూటింగ్ అయ్యాకా కొన్ని రోజులు అదే తలుచుకోని బాధపడ్డాను. అంటూ.. చెప్పుకొచ్చింది. ఇక తన సినిమా విషయాలకు వస్తే గతేడాది “రంగ మార్తండా” చిత్రంతో కనిపించింది. ఇటీవల రిలీజైన రజనీకాంత్ “జైలర్” చిత్రంలోనూ కీలక పాత్రలో నటించింది. మరో వైపు మహేష్ బాబు చిత్రం “గుంటూరు కారం” లో నటిస్తోంది.