మెగాస్టార్ చిరంజీవి నుంచి తాజాగా వచ్చిన బోళాశంకర్ మూవీ మెగాఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానుల్ని డిసప్పాయింట్ చేసింది . బోళాశంకర్ మూవీ రిసల్ట్ చూస్తుంటే చిరంజీవి నుంచి ఇలాంటి మూవీ రావాలని కాదు మేము కోరుకుంటుందని అభిమానులు,ప్రేక్షకులు చెప్తున్నారేమో అని అనిపిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి నుంచి తాజాగా వచ్చిన బోళాశంకర్ మూవీ మెగాఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానుల్ని డిసప్పాయింట్ చేసింది . బోళాశంకర్ మూవీ రిసల్ట్ చూస్తుంటే చిరంజీవి నుంచి ఇలాంటి మూవీ రావాలని కాదు మేము కోరుకుంటుందని అభిమానులు,ప్రేక్షకులు చెప్తున్నారేమో అని అనిపిస్తుంది. ఏది ఏమైనా దెబ్బతిన్న పులి..చిరంజీవి రెండు ఒక్కటే అని ఎన్నో సందర్భాల్లో రుజవయింది కూడా. నెక్స్ట్ చిరంజీవి చెయ్యబోయే కొత్త మూవీ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ మార్కెట్ లో హల్ చల్ చేస్తుంది. కాకపోతే ఆ న్యూస్ నిజమేనని అధికారికంగా చిరంజీవి కాంపౌండ్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.
ప్రస్తుతం చిరంజీవి తన మోకాలినొప్పి ఆపరేషన్ నిమిత్తం ఢిల్లీ లో ఉన్నాడు .ఢిల్లీ నుంచి వచ్చాక స్వయంగా చిరంజీవే తాను చేయబోయే కొత్త సినిమా గురించి ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. కానీ చాలా రోజుల నుంచి చిరంజీవి తన తదుపరి చిత్రం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో ఉంటుందని భావిస్తూ వచ్చారు.సోషల్ మీడియా లో అది నిజమే అని చెప్పే వార్తలు చాలా వచ్చాయి. కళ్యాణ్ కృష్ణ గతంలో నాగార్జున తో సోగ్గాడు చిన్ని నాయన, బంగార్రాజు సినిమాలకి దర్శకత్వం వహించాడు. అందరూ దాదాపుగా చిరు నెక్స్ట్ సినిమా కళ్యాణ్ కృష్ణతోనే అని ఫిక్స్ అయ్యారు.
కానీ ఇప్పుడు బోళాశంకర్ పరాజయం తో చిరంజీవి పునరాలోచనలో పడ్డాడని అంటున్నారు .ఎందుకంటే కళ్యాణ్ కృష్ణ చిరంజీవి తో చేయబోయే సినిమా మలయాళం లో ఘన విజయం సాధించిన బ్రో డాడీ మూవీ కి కొంచం అటు ఇటు గా మార్పులు చేసి రాబోతుందని ఎప్పటి నుంచో అందరూ అనుకుంటున్నారు.పైగా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చిరంజీవి ఇక నైనా రీమేక్ సినిమా లు మానుకోవాలని అభిమానులు ప్రేక్షకులు కోరుకుంటున్నారు .అందుకే కళ్యాణ్ కృష్ణ సినిమా ని పక్కన పెట్టి ఇంకో డైరెక్టర్ తో సినిమా చెయ్యాలని చిరంజీవి నిర్ణయించుకున్నట్టుగా చెప్తున్నారు.
ఫిలింనగర్ సర్కిల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం చిరంజీవి తన నెక్స్ట్ మూవీ ని మురగదాస్ తో చెయ్యాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు.. మురుగుదాస్ ప్రతి సినిమా సామజిక ప్రయోజనం తో కూడి ఉంటుంది .సామాజిక ప్రయోజనంతో కూడిన కధకి కమర్షియల్ టచ్ ఇచ్చి సినిమా ని హిట్ చెయ్యడం లో మురుగు దాస్ దిట్ట. చిరంజీవి సూపర్ హిట్ మూవీ ఠాగూర్ మూవీ తమిళ ఒరిజినల్ వెర్షన్ కి కధ దర్శకత్వం .మురుగుదాసే. అలాగే మురుగుదాస్ డైరెక్టుగా తెలుగులో చిరంజీవి తో స్టాలిన్ లాంటి విజయవంతమైన సినిమాకి దర్శకత్వం కూడా వహించాడు.
అలాగే చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 మూవీ ఒరిజినల్ వెర్షన్ మురుగుదాస్ దే .ఇలా మురుగుదాస్ చిరంజీవిల కాంబినేషన్ తిరుగులేని హిట్ కాంబినేషన్ .చిరంజీవి అభిమానులు, సినీ అభిమానులు కూడా చిరంజీవి తన నెక్స్ట్ సినిమా మురుగుదాస్ దర్శకత్వం లో చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. పైగా ఈ టైం లో సోషల్ మెసేజ్ తో కూడిన సినిమా చేస్తేనే చిరంజీవి స్థాయికి తగట్టుగా ఉంటుందని అందరు కోరుకుంటున్నారు.