ఐపీఎల్ 2022 సీజన్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుందనే చెప్పాలి. ఇప్పటికే రెండు జట్లు తమ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాయి. మరో రెండు జట్లు కూడా దాదాపు ఖాయం అయిపోయినట్లే. ఇంక ముంబై విషయానికి వస్తే టీమ్ పరంగా దారుణంగా ఫెయిల్ అయినా కూడా యంగ్ టాలెంట్ హంట్ లో మాత్రం సక్సెస్ అయినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ ఈ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ముంబై జట్టుకు సరైనోడు దొరికాడు అంటూ మాజీలు సైతం మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం తిలక్ వర్మ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: తెలుగు తేజం తిలక్ వర్మపై హర్భజన్ సింగ్ ప్రశంసలు.. సరైనోడు అంటూ..!
అతని ఆట పరంగానే కాదు.. చైన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో తిలక్ వర్మ 32 బాల్స్ లో 34 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆ సమయంలో మ్యాచ్ తర్వాత బ్యాట్ కిందపెట్టి దండం పెడుతూ కనిపించాడు. అలా ఎందుకు చేశాడు అంటూ చాలా మంది ఆశ్చర్యపోయారు. కొందరైతే ఎవరికి దండం పెట్టాడంటూ సోషల్ మీడియాలో వెతుకులాట ప్రారంభించారు. అయితే అతను దండం పెట్టింది అతని కోచ్ సలాం బయాష్ కి. చెన్నైతో మ్యాచ్ లో సలాం బయాష్ కూడా మైదానంలో ఉన్నారు. అలా మ్యాచ్ తర్వాత తాను ఇంత దూరం రావడానికి సహకరించిన కోచ్ కు మైదానంలో నమస్కారం చేస్తూ తన కృతజ్ఞతను చాటుకున్నాడు.
Tilak Varma the Saviour💙pic.twitter.com/wISafIV6nN
— DHRUV🇫🇷 (@IamDhruv45) May 12, 2022
తన కోచ్ గురించి మీడియా ఛానల్ లో మాట్లాడుతూ.. ‘నేను 11 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించాను. నా కోచ్ సలా బయాష్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ ఎలా చేయాలో నాకు నేర్పించారు. ఆయన నా జీవితంలో లేకపోనే ఇప్పుడు నేను ఇక్కడ ఉండే వాడిని కాదు. ఆయన లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ లేను. ఇప్పుడు క్రికెట్ లో నాకు అందుతున్న గౌరవం మొత్తం ఆయన వల్ల వచ్చిందే, ఆయన లేకపోతే నేను లేను’ అంటూ తిలక్ వర్మ తన కోచ్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. మరోవైపు హర్భజన్ సింగ్ సైతం తిలక్ వర్మపై ప్రశంల వర్షం కురింపించాడు. తిలక్ వర్మ తన కోచ్ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Tilak Varma’s Inspiration @ImRaina ❤️ pic.twitter.com/kcIr4qnvv3
— Harsha (@HarshaTarak8) April 28, 2022