రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా.. ఇలా చెప్పుకుంటూ పోతే టీం అంతా కోట్లు పలికిన ఆటగాళ్లే. ఇలాంటి టీమ్ తో మ్యాచ్ అంటే.. ప్రత్యర్థి ఆటగాళ్లు బయపడాల్సిందే. అవును.. ఇది నిజం. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ అంటే.. ప్రత్యర్తి జట్లకు వణుకు పుట్టేది. కానీ, ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో ఇది రివర్స్ అయ్యింది. వేరే జట్లతో మ్యాచ్ అంటే.. వీళ్లకు వణుకు పుట్టింది. ఐపీఎల్ టోర్నీలో ఐదు సార్లు ఛాంపియన్ అన్న ట్యాగ్ లైన్ తో ఈ సీజన్ లో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ దారుణ పరాజయాలు చవిచూసింది. వరుసగా 8 మ్యాచులను ఓడిన ముంబై పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది.
ఈ ప్రదర్శనపై స్పందించిన ముంబై సారధి రోహిత్ శర్మ.. ఈ సారి తాము అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినా వచ్చే ఏడాది తమ సత్తా ఏంటో చూపిస్తామన్నాడు. ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడిన రోహిత్.. “ఈ సీజన్ ఇలా జరుగుతుందని మేము అస్సలు ఊహించలేదు. అయితే, ఈ ఓటముల వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాం. మా జట్టులో ఒకరికోసం అందరం అన్నట్టుగా సమిష్టిగా నిలబడ్డాం. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుగా కలిసి ఆడటం గొప్ప విషయం. సీజన్ చివర్లో మేం మంచి విజయాలు అందుకున్నాం. ఈ విజయాలు మా పరిస్థితిని మార్చలేకపోయినా.. అవి మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి. వచ్చే సీజన్‌లో మేం మరింత బలంగా రావడానికి కావాల్సినంత ఉత్సాహాన్నిచ్చాయి”.
Rohit Sharma reflects on some positives for MI from IPL 2022 and promises to come back stronger next season.
📸: IPL/BCCI#CricTracker #RohitSharma #MumbaiIndians #MI #IPL #IPL2022 #T20Cricket #Cricket pic.twitter.com/fxnp0vYsPa
— CricTracker (@Cricketracker) June 1, 2022
“జట్టులో విబేధాలు అన్న మాటలకు అర్థం లేదు. జట్టు లో సమిష్టితత్వం పుష్కలంగా ఉంది. జట్టులో ఉన్నవారిలో ఒక్కరిలో కూడా ఓటమిని అంగీకరించే మనస్తత్వం లేదు. మేమంతా ఒక కుటుంబంలా నిలబడ్డాం. ట్రైనింగ్ సెషన్స్ సమయంలో కూడా ఆటగాళ్లు వందకు వంద శాతం కష్టపడ్డారు. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ సీజన్ వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మా ఫోకస్ అంతా వచ్చే సీజన్ మీదే. వచ్చే ఏడాది కప్ కొట్టడమే .. మా లక్ష్యం. అందుకోసం మేం ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతున్నాం..”అని హిట్ మ్యాన్ తెలిపాడు.
SKY makes our goals for 2023 clear! 💪💙#OneFamily #DilKholKe #MumbaiIndians @surya_14kumar @ImRo45 @BrevisDewald MI TV pic.twitter.com/WBPCrPwrZc
— Mumbai Indians (@mipaltan) May 29, 2022
ఇది కూడా చదవండి: Viral Video: బట్లర్ తో చిందేసిన చాహల్ భార్య.. ఫీలై పక్కకి తప్పుకున్న చాహల్!
ప్రస్తుతం ముంబై జట్టులో చాలా మంది కొత్త వాళ్లేనని, ముంబై జట్టుకు వాళ్లే భవిష్యత్ అని కొనియాడాడు. తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, కుమార్ కార్తీకేయ వంటి ఆటగాళ్లంతా తొలి సీజన్ ఆడుతున్నవాళ్లే. వారిని ఉద్దేశిస్తూ.. ‘ఈ సీజన్‌లో కొందరు గన్ ప్లేయర్లను కనుగొన్నాం. వాళ్లు ఫ్యూచర్‌లో స్టార్లు అవుతారు. క్లిష్ట పరిస్థితులలో కూడా వాళ్లు చూపించిన తెగువ, ఆడిన తీరు కచ్చితంగా గర్వించదగ్గ పరిణామం..’ అని హిట్ మ్యాన్ కొనియాడాడు. అయితే.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ పై.. ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఫిక్సింగ్ వల్లే.. ముంబై ఇండియన్స్ ఇలాంటి ప్రదర్శన చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఐపీఎల్ లో ఫిక్సింగ్ జరిగిందా? లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rohit Sharma Smashing Plastic Out Of Our Ocean 🌊
What A Shot @ImRo45 !🔥#RohitSharma | #PlasticFreeOcean pic.twitter.com/n1iG6YSinP
— MI Fans Army™ (@MIFansArmy) May 31, 2022
#OneFamily goals ft. Ro & Ritika 💙💙#DilKholKe #MumbaiIndians @ImRo45 pic.twitter.com/6SPmrnCVPV
— Mumbai Indians (@mipaltan) May 25, 2022