టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ సంచలన కామెంట్ చేశాడు. రోహిత్ శర్మ భయపడుతున్నాడంటూ.. ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌లో టీమిండియా రెండు వరుస విజయాలు సాధించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన భారత్.. తర్వాత మ్యాచ్‌లో హాంకాంగ్‌ను ఓడించి.. సూపర్ ఫోర్ చేరింది. కానీ.. హాంకాంగ్‌పై విజయం సాధించినా భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముఖంలో ఆనందమే లేదని, కెప్టెన్సీ ఒత్తిడి రోహిత్ బ్యాటింగ్‌పై ప్రభావం చూపిస్తుందని హాఫీజ్ అన్నాడు. టీ20ల్లో ధారళంగా పరుగులు చేయగల హిట్ మ్యాన్ ఆసియాకప్‌లో దారుణంగా విఫలం అవుతున్నాడని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా విజయాలతో సక్సెస్‌ఫుల్‌గా ఉన్న రోహిత్.. బ్యాటింగ్‌లో మాత్రం రాణించడంలేదని అన్నాడు.
కాగా.. ఆసియా కప్‌లో రోహిత్ శర్మ పాకిస్థాన్‌పై 12, హాంకాంగ్‌పై 21 పరుగులు మాత్రమే చేశాడు. నిజానికి రోహిత్ శర్మ కూడా చాలా రోజులుగా సరైన ఫామ్‌లో లేడు. విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచే రోహిత్‌లో దూకుడు తగ్గినట్లు అనిపిస్తుంది. అలాగే ఐపీఎల్ 2022 సీజన్‌లో కూడా రోహిత్ శర్మ దారుణంగా విఫలం అయ్యాడు. అలాగే ఇంగ్లండ్, విండీస్ పర్యటనల్లోనూ పెద్దగా రాణించలేదు. ఇప్పుడు ఆసియాకప్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ చేసిన పరుగులు 33 మాత్రమే. ఇదంతా చూస్తుంటే నిజంగానే రోహిత్ శర్మపై కెప్టెన్సీ భారం ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తుంది.
విరాట్ కోహ్లీ సైతం ఫామ్ కోల్పోయిన తర్వాత.. కెప్టెన్సీ భారంతోనే సరిగా రాణించలేకపోతున్నాని చెప్పి, బ్యాటింగ్‌పై దృష్టిపెట్టేందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి.. తొలుత టీ20 కెప్టెన్సీ వదిలేశాడు. ఇప్పుడు రోహిత్ శర్మ పరిస్థితి చూస్తుంటే అతను కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రదర్శన, రోహిత్ ఫామ్‌పై అతని కెప్టెన్సీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కోహ్లీకి కోపం తెప్పించినోడే.. ఇప్పుడు అరుదైన గౌరవం పొందాడు!
Mohammad Hafeez — “Rohit Sharma looks confuse and weak in terms of body language. He is undergoing alot of pressure due to captaincy and so his individual performance is also declining. I think continuing captaincy for Rohit Sharma will be tough in near future.” #AsiaCup2022
— Arfa Feroz Zake (@ArfaSays_) September 1, 2022
Hafeez Rohit Sharma ko sikha rha h ki kya mindset hona chahiye captaincy me…??ffs…😂😂😂😂😂😭😭😭😭 https://t.co/RrzofjZ3Zq
— Akshat Sharma (@CliniicalLM10) August 31, 2022