ఈరోజుల్లో చాలా మంది వర్కౌట్లు చేస్తున్నారు. వ్యాయామం చేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది. అయితే వ్యాయామం చేసే సమయంలో కొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు. మరి వ్యాయామ సమయంలో గుండె సమస్యలు ఉన్నాయని ఎలా తెలుసుకోవచ్చు?
చాలా మందికి వ్యాయామం చేయడం అలవాటు. నిజంగా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా దృఢంగా, యాక్టివ్ గా, ఫిట్ గా కూడా ఉంటారు. అయితే వ్యాయామం చేసినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు కనిపిస్తే గుండె సమస్యలు ఉన్నట్లే అని గుర్తించాలి. ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా వర్కౌట్లు చేస్తుండగా గుండెపోటుతో మరణిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వర్కౌట్లు చేస్తుండగా గుండెపోటు వచ్చింది. ఈయన ఒక్కరే కాదు ఇటీవల కాలంలో జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా గుండెపోటుతో మరణించిన వారు అనేక మంది ఉన్నారు. గుండె సమస్యలు ఉన్నాయన్న విషయం కూడా తెలియదు చాలా మందికి.
వ్యాయామం చేస్తున్నాము కదా, ఆరోగ్యంగానే ఉంటాము అని అనుకుంటారు. వ్యాయామం చేసే సమయంలో గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనబడతాయి. ఆ లక్షణాలను గుర్తించి జాగ్రత్తపడితే కనుక గుండె సమస్యల నుంచి బయట పడచ్చు. వ్యాయామం చేసే సమయంలో కొన్ని లక్షణాల కారణంగా గుండె సమస్యలు వస్తాయి. మీరు వ్యాయామం చేసేటప్పుడు ఈ 6 లక్షణాలు కనబడితే గనుక మీకు గుండె సమస్యలు ఉన్నట్లు. అవేంటో తెలుసుకోండి.
వ్యాయామం చేసే సమయంలో ఎక్కువగా అలసట వస్తుంది. అలసట విపరీతంగా వస్తే కనుక గుండె సమస్య ఉన్నట్టే. బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలను నిరోధించడానికి పని చేస్తుంది. ఇది రక్తపోటును ప్రభావితం చేస్తుంది.
వ్యాయామం చేసే సమయంలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఛాతి నొప్పి వస్తుంది. అసౌకర్యంగా ఉన్నప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది. గుండె వేగం తగ్గిన తర్వాత వర్కౌట్ చేయడం మంచిది.
వ్యాయామం చేస్తున్న సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది గుండె సమస్యకు కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఈ లక్షణం కనిపించినప్పుడు కాసేపు వర్కౌట్ చేయడం ఆపాలి.
గుండెపోటు వచ్చే ముందు ఛాతి నొప్పి వస్తుంది. వ్యాయమ సమయంలో ఛాతి నొప్పి వస్తుంటే గనుక అది గుండె సమస్యకు కారణంగా భావించాలి. ఈ విషయంలో అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు. వ్యాయామం చేస్తుంటే ఛాతి నొప్పి ఎక్కువగా వస్తే గనుక వర్కౌట్ చేయకపోవడం మంచిది. ఈ విషయంలో ఆలస్యం చేయకుండా నిపుణులను సంప్రదించాలి.
వ్యాయమం చేస్తున్నప్పుడు కొంతమంది డీహైడ్రేషన్ కి గురవుతారు. ఈ సమస్య చాలా అధికంగా ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో పొటాషియం, సోడియం, ఎలక్ట్రోలైట్లు కోల్పోతారు. ఈ కారణంగా హార్ట్ బీట్ సమస్య వస్తుంది.
గుండెపోటు వచ్చే ముందు కళ్ళు తిరగడం, తల తిరుగుతున్నట్టు అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. వ్యాయామం చేస్తున్న సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తే గనుక వెంటనే వర్కౌట్ మానేయాలి. వర్కౌట్ చేస్తున్న సమయంలో మీకు పై 6 లక్షణాలు కనిపిస్తే గనుక సంబంధిత నిపుణులను సంప్రదించాలి.
గమనిక: ఈ సమాచారం కేవలం అంతర్జాలంలో సేకరించి ఇవ్వబడింది. దీని మీద పూర్తి అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.