ఆయనొక సినిమా ప్రొడ్యూసర్.. అందులోను మాములు సినిమా కి ఆయన ప్రొడ్యూసర్ కాదు. దేశ భక్తి నేపథ్యంలో వచ్చిన సినిమాకి ప్రొడ్యూసర్. మన దేశం స్వాతంత్రం పొందటానికి కారణమైన ఎంతో మంది వీరుల గురించి మనకి తెలుసు.
మన దేశానికీ స్వాతంత్య్రం రావడానికి కారణమైన ఎన్నో ఉద్యమాల్లో ఆజాది క అమృత్ మహోత్సవ్ అనే ఉద్యమం కూడా ఒకటి. ఆ ఉద్యమం లో పాల్గొన్న అతి పిన్న వయసు వ్యక్తి ఖుదీరామ్ బోస్. ఖుదీరామ్ బోస్ ఆజాది కా అమృత్ మహోత్సవ్ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొని ఉద్యమానికి ఒక ఊపుని తీసుకొచ్చాడు. చరిత్ర గుర్తించని ఆ మహావీరుడి గురించి ఎలాగైనా ఇప్పటి తరానికి తెలియాలనే ఉద్దేశంతో నిర్మాత విజయ్ జాగర్లమూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎక్కడ రాజీపడకుండా అత్యంత భారీ వ్యయం తో ఖుదీరామ్ బోస్ అనే సినిమాని నిర్మించడం జరిగింది. ఆయనకీ ఈ సినిమానే మొట్టమొదటి సినిమా.
గత సంవత్సరమే ఈ సినిమా కంప్లీట్ అయ్యింది. అదే సంవత్సరం డిసెంబర్ నెలలో రాజ్యాంగం దృష్ట్యా భారత దేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ సభ్యుల కోసం ఖుదీరామ్ బోస్ సినిమా ని ప్రదర్శించారంటే సినిమా యొక్క గొప్పతనాన్ని అర్ధం చేసుకోవచ్చు అలాగే గోవా లో జరిగే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ఖుదీరామ్ బోస్ సినిమా ని ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా బాగుందని నిర్మాత విజయ్ జాగర్లమూడిని మెచ్చుకున్నారు. విజయ్ ఈ ఖుదీరామ్ బోస్ సినిమాని అత్యున్నత స్థాయిలో నిర్మించడమే కాకుండా ఖుదీరాం బోస్ లాంటి వీరుడి జీవితాన్ని దేశవ్యాప్తంగాఅందరికి తెలియచేయాలని అనుకుంటే థియేటర్స్ లో మాత్రం విడుదల చెయ్యలేకపోయాడు.దీంతో ఆర్ధిక సమస్యలు రోజు రోజుకి ఎక్కువయ్యాయి.
ఒక వైపు తను ఎంతో ప్రాణం పెట్టి నిర్మించిన ఖుదీరామ్ బోస్ సినిమా విడుదల అవ్వటం లేదనే బాధ. ఇంకోవైపు సినిమా వల్ల వచ్చిన ఆర్ధిక బాధలు విజయ్ ని చుట్టుముట్టాయి. .దాంతో విజయ్ తీవ్ర మానసిక సంఘర్షణకి గురవ్వటం వలన గుండెపోటు రావటం జరిగింది. విజయ్ ని హుటాహుటిన సమీపంలోని హాస్పిటల్ కి తరిలించారు.ప్రస్తుతం విజయ్ కి ట్రీట్మెంట్ జరుగుతుంది. విజయ్ జాగర్లమూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఖుదీరామ్ బోస్ మూవీ కి భారతదేశం గర్వించదగ్గ టెక్నిషియన్స్ పనిచేసారు.
మణిశర్మ,తోటతరణి,రసూల్ ఎల్లోర్,కనల్ కన్నన్ ,మార్తాండ్.కే వెంకటేష్ లాంటి నెంబర్ టెక్నిషియన్స్ ఈ మూవీకి పని చేసారు. అలాగే నటినటుల విషయానికి వస్తే వివేక్ ఒబెరాయ్,అతుల్ కులకర్ణి ,నాజర్ లాంటి గొప్ప ఆర్టిస్టులు ఈ సినిమా లో నటించారు. ఖుదీరామ్ బోస్ క్యారక్టర్ లో నూతన నటుడు రాకేష్ జాగర్లమూడి నటించాడు.రచయిత,ఎఫ్ సి యు కె వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన విద్యాసాగర్ రాజు ఈ సినిమా కి దర్శకత్వం వహించాడు. ఈ ఖుదీరామ్ సినిమా ఫస్ట్ లుక్ ని గత సంవత్సరం లో నే మన దేశ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా విడుదల చేసారు.