నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో మంది రాత్రుళ్లు ఉద్యోగాలంటూ బిజీ లైఫ్ లో మునిగితేలుతున్నారు. మారిన సమాజానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక రాత్రి 12, ఒంటిగంట వరకు మొబైల్ తో చాటింగ్ లు, వీడియోలు, సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు నేటి యువత. దీంతో చాలా మంది టైమ్ కి సరిగ్గా నిద్ర నిద్రపోవటమే మానేస్తున్నారు. ఇంకొంత మంది అయితే ఏకంగా నిద్ర పోవటాన్ని కూడా మరిచిపోతున్నారు.
ఇక దీని కారణంగా ఎన్నో సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఇలా రాత్రి పూట నిద్ర పోకపోవటంతో సరిగ్గా ఉండలేకపోవటం, నీరసంగా ఉండటం, ఒత్తిళ్లకు గురికావటం ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఇక తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో మాత్రం కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒట్టి అనే మ్యాట్రసెస్ సంస్థ మెడిసిన్ అనే సంస్థతో కలిసి ఓ పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో మాత్రం కొన్ని అంశాలు బయటపడ్డాయి. అవేంటో తెలుసుకుందాం..కళ్ళు ఉబ్బినట్లు కనిపించటం, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవటం వంటి అనర్థాలు వస్తాయని ఈ సంస్థ పరిశోధనలో వెలువడ్డాయి.
ఇవి కాకుండా కాస్త మగతగా అనిపించటం, కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, చర్మం పొడిబారటం, అలసటగా ఉండటం వంటి సమస్యలు వస్తాయట. దీంతో పాటు ప్రధానంగా జ్ఞానేంద్రియాలపై ప్రభావం చూపటం, చర్మం ముడతలు పడటం, మానసిక స్థితి బాగా లేకపోవటం, బయాందోళనలకు గురి కావటం వంటి సమస్యలు ఎదురవుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీన్ని గమనించి ఇప్పటకైనా సమయానికి నిద్రపోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.