కంటినిండ నిద్రపోవడం అనేది మన ఆరోగ్యానికి చాలా అవసరం. మారిన కాలానికి అనుగుణంగా ఈ రోజుల్లో చాలా మంది నైట్ షిఫ్ట్స్ అంటూ రాత్రుళ్లు ఉద్యోగాలు చేస్తూ సరిపడ నిద్రపోవడం లేదు. దీంతో అనేక సమస్యలను కొని తెచ్చుకుని చివరికి ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఏకంగా 8 నుంచి 10 గంటల వరకు నిద్రపోతుంటారు. రోజూ 8 గంటల మించి నిద్రపోవడం అంత మంచిది కూడా కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే చాలా మందికి రాత్రిపూట కంటినిండ నిద్రపోయినా మధ్యాహ్నం వేళ మాత్రం ఓ మాదిరిగా నిద్రముంచుకొస్తుంది. ఇది వెంత వరకు మంచిది? కాదు అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక విషయానికొస్తే.. అధిక నిద్రపోయే సమస్యను మనం హైపర్ సోమ్నియా అని అంటారు. దీని ద్వారా అనేక నష్టాలు కూడా లేకపోలేదు.
మధ్యాహ్నం వెళ కడుపు నిండా తిని పనిలో నిమగ్నమవుతున్న వేళ మెల్ల మెల్లగా ఓ కురుకు మొదలై తట్టుకోలేనంత నిద్ర ముంచుకొస్తుంటుంది. ఇలా మధ్యాహ్నం వేళ రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. రాత్రిపూట సరైన నిద్రలేని కారణంగా కూడా పగలు నిద్ర ముంచుకొస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. టైమ్ కు నిద్రపోకపోవడం, ఒత్తిడి, అతిగా మద్యం సేవించడం వల్ల కూడా మధ్యాహ్నం నిద్ర వచ్చే అవకాశాలు ఉన్నాయట.
ఇలా రాత్రిపూట సరిపడా నిద్రపోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. సరైన సమయానికి నిద్రపోవడం చాలా బెటర్ అని తెలియజేస్తున్నారు. దానికి తగ్గ ప్రణాళిక వేసుకుని టైమ్ కు నిద్రపోవాలి. నిద్రపోయే ముందు సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లు, టీవీ చూడడం మానుకోవాలి. సరైన నిద్ర కోసం రోజూ వ్యాయమం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం చేయాలి. ఇకపోతే మధ్యాహ్నం తిని ఒక గంటసేపు నిద్రపోవడం లాభాలే తప్పా నష్టాలు లేవని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.