ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది.
ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ వాడుతున్నారు. ఇది నిత్యావసర వస్తువుగా మారింది. ప్రతి సమాచారం చేరవేసేందుకు, టైం వేస్ట్ కాకుండా ప్రతి విషయాన్ని సేవ్ చేసుకుంటాం.పండుగలకు, ఉత్సవాలకు, విహారయాత్రలకు వెళ్లినప్పుడు మనం తీసుకున్న తీపి గుర్తులుగా ఉండే ఫొటోలను మన స్మార్ట్ ఫోన్ లో భద్రపరచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన ఫైల్స్, మెయిల్స్, మెసేజెస్ మొదలైనవి సేవ్ చేసుకోవచ్చు. అయితే స్మార్ట్ ఫోన్ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అతిగా ఫోన్ వాడితే కనిపించే ప్రతికూల ప్రభావాల గురించి ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు వెలువడ్డాయి.
అతిచిన్న వయసులోనే ఫోన్ వాడడం వలన కలిగే సమస్యలేంటో అమెరికాకు చెందిన ‘ సేపియన్ ల్యాబ్’ అధ్యయనం చేసింది. వరల్డ్ లో 40 కి పైగా దేశాల నుండి 27,969 మంది పాల్గొన్నారు.18-24 ఏళ్ల మధ్య వయసున్న యువతి, యువకుల అభిప్రాయాలను తీసుకుని అధ్యయనం జరిపింది. ఈ అధ్యయనంలో మన భారత దేశం నుండి 4 వేల మంది యువతి, యువకులు పాల్గొన్నారు. 47 అంశాలై సర్వే ప్రారంభించారు. సర్వే ఆధారంగా మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేశారు. అయితే ఈ సర్వే ద్వారా కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి. 6 సంవత్సరాల పిల్లల నుండి 18 సంవత్సరాల పిల్లల వరకు ఫోన్ వాడడం వల్ల మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో తేలింది.
18 సంవత్సరాలనుండి ఆపై వయసు వారు అతిగా ఫోన్ వాడకం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోవడం, కలివిడితనం, వారి భావ ప్రకటన మెరుగు పరుచుకోలేకపోవడం జరుగుతాయని తెలిపారు. మరికొందరిలో ఆత్మహత్యలకు ప్రేరేపితమయ్యే ఆలోచనలు ఎక్కువగా ఉత్యేజం అవుతాయని తేలింది.అమ్మాయిలకు హార్మోన్ ఇన్ బ్యాలన్స్ వల్ల మానసిక, శారీరకంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా యువకుల్లో సమయస్ఫూర్తిగా ఆలోచించడం కోల్పోతారు.
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా భారత్ పేర్గాంచింది కాబట్టి ఇది మనదేశానికే ఒక హెచ్చరిక వంటిది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే భవిష్యత్ లో ముప్పు వాటిల్లుతుందని సర్వే ద్వారా నిరూపితమైంది.వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించే ప్రయత్నం చేస్తే మంచిది. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.