మహారాష్ట్రలో ఉన్నసాయినాధుని ఆలయం.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మరోసారి ఓ రచ్చతో వార్తల్లో నిలిచింది. ఉగ్రవాదులు ముప్పు ఉందన్న కారణంగా.. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)తో భద్రత నివ్వాలని సాయి సంస్థాన్, మహారాష్ట్ర పోలీసుల నిర్ణయం తీసుకోగా.. స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కాగా, ..
దేశంలోని అత్యంత సుప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి షిర్డీ. మహారాష్ట్రలో ఉన్నసాయినాధుని ఆలయం.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మరోసారి ఓ రచ్చతో వార్తల్లో నిలిచింది. ఈ గుడికి ఇప్పటి వరకు మహారాష్ట్ర పోలీసులు భద్రత అందిస్తున్నారు. అయితే ఉగ్రవాదులు ముప్పు ఉందన్న కారణంగా.. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)తో భద్రత నివ్వాలని సాయి సంస్థాన్, మహారాష్ట్ర పోలీసుల నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని స్థానిక గ్రామస్థులు, వ్యాపారస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మే 1న నుండి బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అధికారుల్లో చలనం మొదలైంది.
ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రత ఏర్పాట్లను సాయి సంస్థాన్ సిబ్బంది నిర్వహిస్తోంది. గుడికి మరింత భద్రత అవసరమని 2018లో సంజయ్ కాలే అనే సామాజిక కార్యకర్త ఔరంగాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై బెంచ్ విచారణ జరుపుతూ సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. అయితే సీఐఎస్ఎఫ్ భద్రతకు సాయి సంస్థాన్ అంగీకారాన్ని తెలిపింది. దీంతో రచ్చ మొదలైంది. మహారాష్ట్రలోని షిర్డీలో సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. ప్రజలు వ్యతిరేకిస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
అక్కడి ప్రజలతో చర్చలు మొదలయ్యాయి. అవి సఫలీకృతమయ్యాయి. స్థానిక ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గింది. ఆలయంలో సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించకుండా హైకోర్టులో తాము సర్కార్ తరపున పోరాడుతామని మంత్రి రాధాకృష్ణ వీకే పాటిల్ హామీ ఇచ్చారు. అంతే కాకుండా మరికొన్ని డిమాండ్లను కూడా నెరవేరుస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో మే 1న బంద్ కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నట్లు స్థానిక ప్రజలు వెల్లడించారు. తాజాగా షిర్డీలో జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయాలను తెలియజేయండి