SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Mr Tea Founder Naveen Reddy Love Story An Kidnap Details

సినిమాను మించే ట్విస్టులతో ‘మిస్టర్‌ టీ’ నవీన్‌ లవ్‌ స్టోరీ.. ఆ ఒక్క తప్పుతో పోలీసులకు చిక్కాడు!

  • Written By: Dharani
  • Updated On - Sun - 11 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సినిమాను మించే ట్విస్టులతో ‘మిస్టర్‌ టీ’ నవీన్‌ లవ్‌ స్టోరీ.. ఆ ఒక్క తప్పుతో పోలీసులకు చిక్కాడు!

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో మహిళా డాక్టర్‌ కిడ్నాప్‌ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారం వల్లనే ఈ కిడ్నాప్‌ చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని మిస్టర్‌ టీ వ్యవస్థాపకుడు నవీన్‌ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. దాంతో ఈ కిడ్నాప్‌ వ్యవహారంపై ఆసక్తి నెలకొంది. అసలు నవీన్‌ రెడ్డి, వైశాలిల మధ్య పరిచయం ఎలా ఏర్పడింది.. ఎందుకు విడిపోవాలనుకున్నారు.. మరి నవీన్‌ రెడ్డి ఎందుకు ప్రేమించిన యువతినే కిడ్నాప్‌ చేయాలని భావించాడు.. పోలీసులు అతడిని ఎలా గుర్తించారు వంటి విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మిస్టర్‌ టీ నవీన్‌ రెడ్డి గురించి.. అతడి ప్రేమ వ్యవహారం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివారలు..

నవీన్‌ రెడ్డి నవీన్‌ రెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లా ముషంపల్లి. ఇతడు ప్రస్తుతం హస్తినాపురంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మిస్టర్‌ టీ అనే కంపెనీని ప్రారంభించాడు. ప్రస్తుతం దీనికి దేశవ్యాప్తంగా 400 వరకు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇక్కడ టీ, కాఫీ, మిల్క్‌ షేక్‌లు, స్నాక్స్‌ అన్ని లభిస్తాయి. ఇక కొద్ది రోజుల్లోనే ఈ టీ స్టాల్‌కి ఆదరణ పెరిగింది. ప్రస్తుతం నగరంలో నాలుగు చోట్ల మిస్టర్‌ టీ ఔట్‌లెట్లు ఉన్నాయి. ఈ వ్యాపారం మీద ఆసక్తి ఉన్నవారికి ఫ్రాంచైజీ కూడా ఇస్తారు. బిజినెస్‌ ప్రాంరభించించిన కొద్ది రోజుల్లోనే అది సక్సెస్‌ అవ్వడం వెనక నవీన్‌ రెడ్డి కృషి, పట్టుదల ఉన్నాయి. ఇక వృత్తిగత జీవితం ఇలా సాగుతుండగా.. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. వైశాలితో ప్రేమలో ఉన్నాడు నవీన్‌ రెడ్డి. కరోనా సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. వైశాలి ప్రతి రోజు టెన్నిస్‌ ఆడేందుకు వెళ్లేది. ఈ క్రమంలోనే ఆమెకు నవీన్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారింది.

mr. tea

ఇక వైశాలి తల్లిదండ్రులకు కూడా నవీన్‌ రెడ్డి నచ్చాడు. జీవితంలో సెటిల్‌ అవ్వడమే కాక.. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో.. ఇద్దరికి వివాహం చేయాలని వైశాలి తల్లిదండ్రులు భావించారు. వైశాలి చదువు పూర్తయ్యాక ఇద్దరికి వివాహం చేయాలని నిర్ణయించారు. ఇక తల్లిదండ్రులు పెళ్లి ఫిక్స్‌ చేయడంతో.. వైశాలి, నవీన్‌ రెడ్డిల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరు సినిమాలు, షికార్లంటూ తిరిగేవారు. తల్లిదండ్రులు కూడా పెళ్లి చేయాలని భావించారు కనుక.. వారికి ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఇలా కొన్ని నెలల పాటు ఇద్దరి మధ్య ప్రేమ బంధం కొనసాగింది.

మరి ఇంతలో ఏమయ్యిందో తెలియదు కానీ.. నవీన్‌ రెడ్డితో పెళ్లి తమకు ఇష్టం లేదని చెప్పారు వైశాలి తల్లిదండ్రులు. దాంతో వారిద్దరూ బాధపడ్డారు. కానీ తల్లిదండ్రుల మాట ప్రకారం.. నవీన్‌ రెడ్డితో పెళ్లికి నో చెప్పింది వైశాలి. కానీ నవీన్‌.. ఈ తిరస్కారాన్ని అంగీకరించలేకపోయాడు. ఎలాగైనా సరే.. వైశాలికి తన ప్రేమను తెలియజేసి.. ఆమెను ఇంప్రెస్‌ చేసి.. మళ్లీ తనను ప్రేమించేలా చేసుకుని.. వివాహం చేసుకోవాలని భావించాడు. అందుకోసం సినిమాటిక్‌ స్టైల్లో.. ఎన్నో ప్రయత్నాలు చేశాడు నవీన్‌ రెడ్డి. ఇక వైశాలిని ఇంప్రెస్‌ చేసేందుకు.. ఆమె ఇంటి ముందే.. ఓ గ్లాస్‌ హౌస్‌ని నిర్మించుకుని.. అందులో ఉంటూ.. వైశాలి దృష్టిలో పడే ప్రయత్నాలు చేయసాగాడు.

mr. tea

ఇక నవీన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైశాలి కుటుంబసభ్యులు.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. నవీన్‌ రెడ్డి.. తమ కూతురి వెంట పడి.. ఇబ్బందికి గురి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పోలీసులు నవీన్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు తన లవ్‌ స్టోరీ గురించి వారికి చెప్పి.. ఎలాగోలా బయటకు వచ్చాడు. ఇక గత ఆరు నెలలుగా.. వైశాలిని ఇంప్రెస్‌ చేసే ప్రయత్నంలో ఉన్నాడు నవీన్‌ రెడ్డి. దాంతో విసుగు చెందిన వైశాలి తల్లిదండ్రులు ఇలా అయితే లాభం లేదని భావించి.. ఈ సారి ఏకంగా మెజిస్ట్రేట్‌ ముందు.. నవీన్‌ రెడ్డితో పెళ్లి తనకు ఇష్టం లేదని.. వైశాలి చేత స్టేట్మెంట్‌ ఇప్పించారు. దాంతో నవీన్‌ రెడ్డికి వాళ్ల మీద కోపం పెరిగిపోయింది.

ఇక వైశాలి తల్లిదండ్రులు.. ఆమెకు వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టారు. శుక్రవారం ఆమెకు పెళ్లి చూపులు నిర్వహించారు. విషయం తెలిసిన నవీన్‌ రెడ్డి.. విచక్షణ కోల్పోయి.. ఎలాగైనా సరే.. వైశాలిని దక్కించుకోవాలని భావించాడు. దాంతో.. సినిమా స్టైల్లో.. తన వెంట ఓ 100 మందిని వెంటపెట్టుకుని.. వైశాలి వాళ్ల ఇంటికి వెళ్లి.. అక్కడ నానా రచ్చ చేశాడు. అడ్డుకోబోయే వారి మీద దాడి చేసి.. వైశాలిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకుని.. సొంతం చేసుకోవాలని భావించాడు. అక్కడి వరకు అతడి ప్లాన్‌ సక్సెస్‌ అయ్యింది.

 

ఇక ప్రియురాలిని పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉండగా.. ఆమె భయంతో.. తన తల్లిదండ్రులను తలుచుకుని ఏడవడం ప్రారంభించింది. ప్రియురాలి ఏడుపు చూసి.. కరిగిపోయిన నవీన్‌ రెడ్డి.. ఆమె తండ్రితో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చి.. కాల్‌ చేసి ఇచ్చాడు. అదిగో అక్కడే దొరికిపోయాడు. అప్పటికే వైశాలి కిడ్నాప్‌ గురించి తెలుసుకున్న పోలీసులు.. నవీన్‌ రెడ్డి కోసం గాలిస్తున్నారు. ఇంతలో వైశాలి.. తండ్రికి కాల్‌ చేయడంతో.. పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ని ట్రాక్‌ చేసి.. వాళ్లున్న చోటుని కనుక్కుని వెళ్లి.. నవీన్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుని.. డాక్టర్‌ వైశాలిని క్షేమంగా ఆమె ఇంటికి చేర్చారు.

ఇక ఈ కిడ్నాప్ చేసింది మిస్టర్ టీ ఫౌండర్ నవీన్ రెడ్డి కావటంతో.. ఈ కిడ్నాప్‌ వ్యవహారంపై ఆసక్తి పెరిగింది. పట్టపగలే.. అందరూ చూస్తుండగా.. సుమారు వంద మంది వచ్చి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి.. ఓ అమ్మాయిని ఎత్తుకెళ్లాటం.. అది కూడా ఓ యువ పారిశ్రామిక వేత్తగా పేరుపొందిన వ్యక్తి చేయటంతో.. ఈ ఘటన కాస్త సంచలనంగా మారింది. మీడియా వాళ్లంతా అక్కడికి చేరుకోవటంతో.. ఈ విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఆఖరికి ఒక్క ఫోన్‌ కాల్‌తో కథ సమాప్తం అయ్యింది. ప్రస్తుతం నవీన్‌ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడు.

Tags :

  • Adibatla
  • Crime News
  • kidnap
  • Lady Doctor
  • Love Story
  • Mr Tea
  • Naveen
  • Rangareddy District
  • Telangana
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

    యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam