ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారా..? మీ వెహికల్ పై ఎంత చలాన్ ఉందో తెలియదా..? అయితే ఈ కథనం మీకోసమే. ఎక్కడ..? ఎలా..? ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారు. ఎంత చలాన్ విధించారు..? అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వివరాలు తెలుసుకున్నాక.. ఆ మొత్తాన్ని ఆన్ లైన్ పేమెంట్‌తో అమౌంట్‌ని క్లియర్ చేయవచ్చు.
ఏదైనా వాహనం నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, పాటించరు. ట్రాఫిక్ సిబ్బంది పట్టుకున్నప్పుడు చూద్దాంలే అన్నట్లుగా నిర్లక్ష్యంగా నిబంధనలు అతిక్రమించి ప్రయాణం సాగిస్తుంటారు. అలా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా తిరిగే వారికి ట్రాఫిక్ పోలీసులు చలాన్ వేస్తుంటారు. గతంలో చలాన్ వేయడమంటే.. ట్రాఫిక్ సిబ్బందికి దొరికినప్పుడే విధించేవారు. కానీ, ఇప్పుడలా లేదు. దాదాపు అన్ని చోట్లా సీసీటీవీ కెమెరాలు ఉంటున్నాయి. వీటి సహాయంతో కూడా చలాన్లు విధిస్తున్నారు. ఇలా ఏ విధంగా చూసుకున్న మీరు ట్రాఫిక్ నియమాలు పాటించకుంటే ఇక అంతే సంగతులన్నమాట. కాబట్టి ఇకపైనా కాస్త అలెర్ట్‌గా ఉంటూ ట్రాఫిక్ చలాన్లను తప్పించుకోండి.
ఏదేని సందర్భంలో ట్రాఫిక్ సిబ్బందికి పట్టుబడినప్పుడు లేదా మీ వాహనాన్ని ఫోటో తీసినప్పుడు ఎంత మొత్తంలో జరిమానా విధిస్తారోనని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. దాన్ని ఎలా తెలుసుకోవాలో చాలా మందికి తెలియక తికమక పడుతుంటారు. ఆ వివరాలకు సంబంధించిన ఫైన్ అమౌంట్ ఎంతన్నది ఆయా రాష్ట్రాల ట్రాఫిక్ పోలీస్ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. ఏ రోజు ఎంత ఫైన్ పడింది..? మీరు ఎలాంటి రూల్స్ అతిక్రమించారు..? అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అందుకు జతచేస్తారు. నిజంగానే మీకు ఫైన్ పడినట్లు భావిస్తే చలాన్ వెబ్ సైట్ ఆధారంగా మీ జరిమానా వివరాలు తెలుసుకోవచ్చు.
తెలంగాణకు చెందిన వారు ఎవరైనా తమ చలాన్ వివరాలు తెలుసుకోవాలంటే https://echallan.tspolice.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. బైక్ లేదా కారు నంబర్ ఎంటర్ చేసి మీ ఫైన్ అమౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు. మీ వాహనానికి ఎక్కడ, ఏ టైమ్ కి చలాన్ విధించారో ఫోటోతో సహా క్లియర్ గా చూడవచ్చు. చలాన్ కి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాక ఆన్ లైన్ పేమెంట్ తో అమౌంట్ ని క్లియర్ చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్ చెందిన వారు తమ చలాన్ వివరాలు తెలుసుకోవాలంటే https://apechallan.org/ ద్వారా తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీ ఫైన్ వివరాలకు సంబంధించిన ఫోటోల వివరాలు లభించకపోయినప్పటికీ ఎక్కడ..? ఎందుకు..? మీకు ఫైన్ విధించారో కచ్చితమైన లొకేషన్ తో సహా చూపిస్తుంది.
కేంద్రానికి సంబంధించిన వెబ్ సైట్ ద్వారా కూడా మీ పెండిగ్ చలాన్ల వివరాలను తెలుసుకోవచ్చు.అందుకోసం https://echallan.parivahan.gov.in/ లోకి వెళ్లి గెట్ యువర్ చలాన్ డీటైల్స్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఆపై మీకు ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వెహికిల్ నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ని ఉపయోగించి ఫైన్ వివరాలు తెలుసుకోవచ్చు.