జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని అందరూ కలలు కనడం సహజం. ఆకాశంలో విహరిస్తూ.. తక్కువ సమయంలోనే గమ్యంస్థానం చేరుకునే అవకాశం ఉండటం అలా కలలు కన్నడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అందుకే, సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణమంటే వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి వీట్ జెట్ అనే ఎయిర్‌లైన్స్ సంస్థ శుభవార్త చెప్పింది. ఎవ్వరూ ఉహించని విధంగా 26 రూపాయలకే విమాన ప్రయాణం అందిస్తామంటూ ముందుకొచ్చింది.
7/7 తేది ప్రత్యేకతగా వీట్ జెట్ ఈ ఆఫర్ తీసుకువచ్చింది. 777,777 ఫ్లైట్ టికెట్లకు ఆఫర్ వర్తిస్తుంది. జూలై 7 నుంచి 13 వరకు వారం రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ రూట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆఫర్‌లో భాగంగా టికెట్లు బుక్ చేసుకునే వారు మార్చి 15, 2022 నుంచి మార్చి 26,2023 వరకు ప్రయాణం చేయొచ్చు.
Vietjet Air Be offering: You’ll commute through air for simply Rs 26, be offering until 13 July https://t.co/vmpxLENwnK
— news24buzz (@news24buzz1) July 8, 2022
ఇది కూడా చదవండి: Aadhar: మీ ఆధార్ వివరాలను ఎక్కడెక్కడ వాడారో ఇలా తెలుసుకోండి..!
ఇండియన్ ప్యాసింజర్లకు మరో స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. సెప్టెంబర్ తర్వాత న్యూఢిల్లీ, ముంబై నుంచి హనోయి, హోచిమిన్ సిటీ, ఫూ క్వోక్ వంటి పట్టణాలకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే.. న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు నుంచి వియత్నంలోని డానాంగ్‌కు ప్రయాణించొచ్చు. ప్రస్తుతం ఈ కంపెనీ భారత్, వియత్నాం మధ్య నాలుగు సర్వీసులు అందిస్తోంది. న్యూఢిల్లీ, ముంబై నుంచి హనోయి, న్యూఢిల్లీ, ముంబై నుంచి హోచిమిన్ సిటీకి ఈ సర్వీసులు ఉన్నాయి.
On ‘double day’ 7/7, #Vietnamese airline #VietJet puts 777,777 domestic & international tickets on sale from VND7,700.Promotion to last till 23:59, Jul 13 for travel from Aug 15-Mar 26, 2023. India, South Korea, Japan, Indonesia, Thailand, Singapore & Malaysia covered. #IO pic.twitter.com/VpllxDJSTB
— INDIA OUTBOUND MAGAZINE (@indiaoutbound) July 7, 2022
ఇటీవల వీట్ జెట్ కంపెనీ ఐదు కొత్త ఇంటర్నేషనల్ రూట్లలో సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త సర్వీసులు 2022 మూడో త్రైమాసికం నుంచి అందుబాటులోకి రావొచ్చు. వారానికి నాలుగు నుంచి ఏడు రిటర్న్ ఫ్లైట్స్ ఉండొచ్చు. ఏదేమైనా లీటర్ పెట్రోల్ 100 రూపాయలు ఉన్న ఈరోజుల్లో 26 రూపాయలకే విమాన ప్రయాణం అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Prepaid Recharge Plan: ధమాకా అఫర్.. రూ.106 రీఛార్జ్ తో 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి వివరాలివే!