వాతావరణ కాలుష్యంతో పాటు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి బయటపడడానికి విద్యుత్ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకుంటున్నారు వాహనదారులు. అయితే కొన్నాళ్ళకు విద్యుత్ వినియోగం పెరిగిపోయి.. ఆ కరెంట్ ధరలు కూడా చుక్కలు చూపించే అవకాశం లేకపోలేదని ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూడని వాళ్ళు ఉన్నారు. దీనికి తోడు అస్తమానూ ఛార్జింగ్ పెట్టుడు, తీసుడు ఈ టెన్షన్ అంతా ఎవరు పడతారు అని చెప్పి కొనడానికి ఆసక్తి చూపించనివాళ్ళూ లేకపోలేదు. పైగా లిథియం బ్యాటరీలు పేలిపోతుందేమో […]
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం ఏదంటే.. టక్కున చైనా అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ చైనానే మన దేశం మించిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఇటీవలే చైనాలో జననాల రేటు తగ్గినట్లు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్.. చైనా జనాభాను దాటేసి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయితే వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనాల ప్రకారం.. 2022 చివరి నాటికి భారతదేశం యొక్క జనాభా 141.7 కోట్లు కాగా.. ప్రస్తుత జనాభా (జనవరి 18 […]
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీకి భారత్‌లో ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ మన దేశ మార్కెట్‌ను వినియోగించుకోవడంలో మారుతి సంస్థ ఫుల్ సక్సెస్ అయ్యింది. మిగతా కార్ల కంపెనీలకు భిన్నంగా ఆలోచిస్తూ దూసుకెళ్తోందీ సంస్థ. ఇక్కడి వినియోగదారుల అవసరాల దృష్ట్యా తన ఉత్పత్తులను తక్కువ ధరలకే విక్రయిస్తోంది. మైలేజీ విషయంలోనూ మారుతీకి మిగతా కార్లు సాటిరావు. తక్కువ ధరతో అత్యాధునిక ఫీచర్లు, మంచి మైలేజీని అందిస్తోంది […]
ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో పాకిస్తాన్ ఆర్థిక సహాయం కోసం ప్రపంచ దేశాలను వేడుకుంటుంది. ఈ క్రమంలో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో 3 సార్లు యుద్ధాలు చేసిన తర్వాత పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకుందని అన్నారు. పొరుగు దేశమైన భారత్ తో శాంతిని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే కాశ్మీర్ లో జరుగుతున్న వాటిని ఆపాలని సూచించారు. దుబాయ్ కేంద్రంగా పని చేసే ఓ […]
టెక్నాలజీ రంగంలో యాపిల్ సంస్థ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కాదు. ఫోన్ల దగ్గర నుంచి ల్యాప్‌టాప్స్ వరకు యాపిల్ తీసుకొచ్చిన దాదాపు ప్రతి ప్రాడక్ట్ సూపర్ హిట్టయ్యిందనే చెప్పాలి. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ లాంటి అంశాలకు పెద్దపీట వేసే యాపిల్.. అధునాతన ఫీచర్లను ప్రొవైడ్ చేయడం ద్వారా ఇతర పోటీ కంపెనీలను వెనక్కినెడుతూ వస్తోంది. క్వాలిటీ పరంగా మిగతా బ్రాండ్ల డివైజ్‌లతో పోల్చుకుంటే యాపిల్ ఉత్పత్తులు చాలా బాగుంటాయనే పేరుంది. అయితే ఎన్ని ప్రత్యేకతలు ఉన్నా మధ్యతరగతి […]
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంత ప్రజలు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతతో పాకిస్థాన్‌లో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. త్వరలోనే శ్రీలంకలో ఎదురైన పరిస్థితులు పాక్‌లోనూ ఎదురవ్వడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై పాకిస్థాన్‌లో ఉండటం తమ వల్ల కాదంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఆదేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో తమను కలిపేయాల్సిందిగా పాకిస్థాన్ ప్రభుత్వానికి వాళ్లు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్గిల్ రోడ్డును […]
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ త్వరలోనే భారత్‌లో రిటైల్ స్టోర్లను తెరవబోతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిలో తొలి దశలో 12 స్టోర్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను సైతం ఆహ్వానిస్తోంది. 2021 జనవరి ఆరంభంలో యాపిల్ సంస్థ సీఈవో ‘టిమ్ కుక్’ మాట్లాడుతూ, ఆన్‌లైన్ స్టోర్లకు దేశంలో అద్భుతమైన స్పందన లభించిందని, భవిష్యత్తులో రిటైల్ స్టోర్లను ప్రారంభించేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. […]
వరుసగా మూడో టీ20 వరల్డ్ కప్‌ను సాధిస్తూ.. భారత క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. మనదేశంలో జరిగిన అంధుల టీ20 వరల్డ్ కప్ 2022ను టీమిండియా కైవసం చేసుకుంది. దీంతో.. వరుసగా మూడు వరల్డ్ కప్‌లు నెగ్గిన జట్టుగా ప్రపంచ రికార్డును సృష్టించింది భారత్. డెహ్రాడూన్‌లో శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 […]
సరిహద్దు వెంట భారత్ – చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. దుష్ట చైనా తన దుస్తంత్రాన్ని మళ్లీ ప్రయోగించింది. డోక్లాం, గాల్వన్ ప్రాంతాల్లో ఘర్షణల తర్వాత ఇప్పుడు మరోసారి అరుణాచల్ ప్రదేశ్ లోని తవంగ్ ప్రాంతంలో భారత సైనికులతో ఘర్షణకు దిగింది. ఈ ఘటన ఈ నెల 9న జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడినట్లు సమాచారం. ఎల్ఏసీకి సమీపంలోకి చైనా సైనికులు వచ్చినప్పుడు ఈ ఘర్షణ జరిగినట్లుగా ఆర్మీ […]
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్.. తన ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి ఇండియాకు తరలించే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై భారత అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. చైనాతో రాజకీయ ఉద్రిక్తతలు, కొవిడ్ విజృంభణ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం విధించిన కఠిన లాక్‌డౌన్ కారణంగా.. యాపిల్ ఉత్పత్తుల తయారీని నిలిపివేయాలని భావిస్తోందని సమాచారం. 2025 కల్లా.. Mac, iPad, Apple Watch, Airpods వంటి యాపిల్ ఉత్పత్తుల్లో 25 శాతం వరకైనా చైనా […]