ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ తో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలకు పోటీగా సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతోంది. తాజాగా.. కేవలం రూ.106 రీఛార్జ్ ప్లాన్ లో 84 రోజుల వ్యాలిడిటీతో మరో చౌకైన రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ రీఛార్జ్ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. BSNL రూ. 106 రీఛార్జ్ ప్లాన్ ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను 3GB హై స్పీడ్ డేటా మరియు 100 మినిట్స్ ఉచిత లిమిటెడ్ కాలింగ్ మినిట్స్ కూడా లభిస్థాయి. ఈ ఉచిత కాలింగ్ మినిట్స్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇక ఈ 100 మినిట్స్ ఉచిత కాలింగ్ లిమిట్ ముగిసిన తరువాత నిముషానికి 30 పైసలు చెల్లించాలి. pic.twitter.com/cOMcqdMKux — Govardhan Reddy (@gova3555) July 9, 2022 మరోవైపు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు కూడా.. రూ.200 కంటే తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అమలులో ఉన్నాయి. కానీ, పై కంపెనీలలో ఏవీ కూడా ఎక్కువ వ్యాలిడిటీని యుజర్లకు ఇవ్వడం లేదు. ఈ విషయంలో బీఎస్ఎన్ఎల్ ఎక్కువ రోజుల వ్యాలిడిటీని కస్టమర్లకు అందజేస్తుంది. ఈ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. pic.twitter.com/BrFvIUGKEq — Govardhan Reddy (@gova3555) July 9, 2022 ఇది కూడా చదవండి: Adani Group: టెలికాం రంగంపై కన్నేసిన అదానీ! అంబానీ, బిర్లాలకు పోటీ తప్పదా?