ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఆన్‌లైన్ పేమెంట్లే. చిన్న బడ్డీ కొట్టుకు వెళ్లినా యూపీఐ పేమెంట్ ఉంటోంది. పెద్ద నోట్ల రద్దు, కరోనా మహమ్మారి పుణ్యమా అని వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దాన్నే క్యాష్ చేసుకోవాలనుకుంటోంది టాటా గ్రూప్. టాటా గ్రూప్.. దీని గురించి తెలియని వాళ్లు ఎవ్వరూ ఉండరు. వాహనాల నుంచి ఇంట్లో ఉపయోగించే ఉప్పు వరకు టాటా బ్రాండ్ మనకు కనిపిస్తుంది. వ్యాపారంతో పాటు రతన్ టాటా తన సంపాదనలో ఎక్కువశాతం సమాజం కోసం ఉపయోగింస్తుంటారు. అలానే వ్యాపార రంగంలో కూడా తనదైన మార్క్ చూపిస్తోంది ఈ కంపెనీ. తాజాగా గూగుల్ పే, ఫోన్‌పేలకు టాటా షాకిస్తూ.. పేమెంట్ యాప్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.
టాటా పే స్టార్టింగ్ ఆఫర్స్..పే చేస్తే రివార్డు పాయింట్స్
టాటా పే యూపీఐ సేవలు టాటా న్యూ యాప్‌లో అందుబాటులో ఉండనున్నాయి. టాటా న్యూ యాప్‌తో జరిపే లావాదేవీలను టాటా పే ఉపయోగించి చెల్లించవచ్చును. ఈ చెల్లింపులతో యూజర్లకు న్యూకాయిన్స్(Neu coins)ను లభించనున్నాయి. టాటా న్యూ అందించే రిడెంప్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా టాటా పే ఉపయోగించి లేదా ఏదైనా టాటా గ్రూప్స్‌కు చెందిన స్టోర్లలో జరిపే కొనుగోళ్ల ద్వారా మాత్రమే న్యూకాయిన్స్ లభిస్తాయి. ప్రతి ఒక్క న్యూకాయిన్ విలువ రూ. 1 తో సమానం. కొత్త టాటా పే యూపీఐ ఖాతాను సృష్టించడానికి.. ప్రతి ఒకరు మూడు దశల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అనుసరించాలి. స్కానింగ్, బ్యాలెన్స్ చెక్, ఖాతా/ స్వీయ-బదిలీ మొదలైన అన్ని సేవలను పొందవచ్చును.
Welcome to Tata Neu, the Super App that guarantees the ultimate shopping experience. Get exclusive offers, privileges, and rewards every time you…
Shop, dine, travel, pay and earn rewards, on the incredible super app, #TataNeu
The app will go live along with the IPL at 7:30 pm. pic.twitter.com/J93cv1ogAh— BrandLogix (@brandlogixindia) April 7, 2022
ఇది కూడా చదవండి: అప్పుడు పెట్టుబడులకు నో! ఇప్పుడు ఇండియానే నెంబర్ 1 !
గతేడాదితో పోలిస్తే.. భారత్‌లో యూపీఐ సేవలు గణనీయంగా పుంజుకున్నాయి. దేశ వ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు ఫిబ్రవరి, 2022లో రూ. 8.26 లక్షల కోట్లు జరగగా.. మార్చి 2022లో రూ. 9.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరలో యూపీఐ లావాదేవీలు ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా రూ. 81 లక్షల కోట్ల మార్కును దాటాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది.
A message from our Chairman N. Chandrasekaran on the arrival of our much awaited super app, @tata_neu. #ThisIsTata #TataNeu pic.twitter.com/TFmQvktvcf
— Tata Group (@TataCompanies) April 7, 2022
Tata group’s super-app #TataNeu , will be launched today bringing every digital service by #TataGroup into one platform.
listing on Google PlayStore and Apple’s App Store
Read for more details :#Tatamotors #TatacurvvEV #tatapower https://t.co/bDxwcvHkmq
— BS Latest News (@BS_latestnews) April 7, 2022
What’s new? Tata Neu! Say hello to the superhero of apps. @tata_neu brings together all our brands you know and love under our first ever super app. 🎉 #ThisIsTata #TataNeu pic.twitter.com/2be7pXyZQc
— Tata Group (@TataCompanies) April 7, 2022