నగదు రహిత లావాదేవీల్లో భారతదేశం చాలా పురోగతి సాధించిందనే చెప్పాలి. ఎక్కువగా యూపీఐ యాప్స్ ద్వారానే ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ లావాదేవీల మీద ఛార్జెస్ లేవు. కానీ, పీపీఐ ద్వారా యూపీఐ మర్చంట్స్ చేసే లావాదేవీలపై ఛార్జెస్ పడనున్నాయి.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించే విషయంలో కేంద్రం దాదాపుగా సఫలీకృతమైందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు బడ్డీ కొట్టు దగ్గర టీ తాగి కూడా.. ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ లావాదేవీలపై ఎలాంటి ఛార్జెస్ లేవు. కానీ, ఇక నుంచి ఛార్జెస్ మోత మోగనుంది. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ యాప్స్ ద్వారా చేసే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్ట్రూమెంట్ ట్రాన్సక్షన్లు రూ.2 వేలు మించితే మాత్రం 1.1 శాతం వరకు ఛార్జీలు పడనున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం అంటూ ఎక్కువ నగదు రహిత లావాదేవీలకే ప్రజలు అలవాటు పడ్డారు. అవి ఇప్పటివరకు ఎలాంటి అదనపు ఛార్జెస్ లేకుండా అందుబాటులో ఉన్నాయి. కానీ, ఏప్రిల్ 1 నుంచి మాత్రం ఈ లావాదేవీలపై అదనపు ఛార్జెస్ పడనున్నాయి. ఎందుకంటే యూపీఐ యాప్స్ ద్వారా చేసే పీపీఐ ట్రాన్సక్షన్లు రూ.2 వేలు దాటితే వాటిపై గరిష్టంగా 1.1 శాతం వరకు ఇంటర్ ఛేంజ్ ఛార్జీలు వేయనున్నారు. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(npci) సర్క్యూలర్ విడుదల చేసింది. దాని ప్రకారం.. మర్చంట్ ట్రాన్సాక్షన్లపై పీపీఐ ఛార్జెస్ పడనున్నాయి.
పీపీఐ పేమెంట్స్ చేసే ట్రాన్సాక్షన్లపై 0.5 శాతం నుంచి 1.1 వరకు ఇంటర్ ఛేంజ్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. పెట్రోల్- డీజిల్ చెల్లింపులపై 0.5 శాతం, విద్య, వ్యవసాయం, టెలికాం వంటి అవసరాల కోసం 0.7 శాతం, సూపర్ మార్కెట్లలో 0.9 శాతం, గవర్నమెంట్, బీమా, రైల్వేస్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిపై 1 శాతం వరకు ఇంటర్ఛేంజ్ ఛార్జెస్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ ని అప్రూవ్ చేయడం, ఆథరైజ్, ప్రాసెస్ వంటి వాటిపై ఈ ఛార్జెస్ వసూలు చేస్తారు. యూపీఐ మర్చంట్ పేమెంట్స్ ఛార్జెస్ పై వసూలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Paytm, PhonePe can finally earn revenue on their wallets!
National payments corporation recommends PPI charges for merchant transactions via UPI#StockMarketindia #investing #trading pic.twitter.com/G51pRX8p95
— STOCK ARK (@stoc_ark) March 28, 2023