ఇంటర్నెట్ వినియోగం పెరిగాక ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది. ఇక కరోనా మహమ్మారి రాకతో సినిమా హాల్స్ పై నిషేధం విధించడంతో.. ఓటీటీ యాప్ ల బిజినెస్ ఉహకందని రేంజ్ లో అభివృద్ధి చెందింది. అలాగే ఓటీటీ యాప్ లు సైతం.. కామెడీ షోలు, వెబ్ సిరీసులు, కొత్త సినిమాలు, డైలీ సీరియల్ ఎపిసోడ్ లతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కస్టమర్లు కూడా ఈ యాప్ ల వల్ల బాగా ఎంటర్టైన్మెంట్ లభిస్తుండంతో వీటి వైపు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్ తో ముందుకొచ్చింది.
ఇప్పటికే ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా కంపెనీలు పలు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుండగా రిలయన్స్ జియో మాత్రం కేవలం పోస్ట్‌పెయిడ్ యూజర్లకు మాత్రమే ఉచితంగా అందిస్తోంది. అలాగే ఈ ప్లాన్లలో.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు డిస్నీ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ఇతర ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ను కూడాఫ్రీగా ఆఫర్ చేస్తోంది.
జియో అందిస్తోన్న ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ల వివరాలు:
జియో ఐదు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆఫర్ చేస్తోంది. రూ. 399, రూ. 599, రూ. 799, రూ. 999, రూ. 1499 విలువైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై జియో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌లో డేటాతో పాటు, జియో టీవీ సహా పలు జియో యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఆయా ప్లాన్స్‌తో పాటు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైం సబ్‌స్క్రిప్షన్స్‌ను జియో ఆఫర్ చేస్తోంది.
ఇక జియో ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ అందుబాటులో లేదు. జియో ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైం ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ చేస్తున్నా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ మాత్రం ప్రీపెయిడ్ ప్లాన్లతో జియో ఉచితంగా ఆఫర్ చేయడం లేదు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Reliance Jio: రిలయన్స్ జియో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ముఖేశ్ అంబానీ! కొత్త చైర్మన్ గా..