రిలయన్స్.. దాదాపు అందరికి సుపరిచతమైన పేరిది. వ్యాపారంగంలో రిలయన్స్ అనేది ఓ సామ్రాజ్యం. ఆ రిలయన్స్ సామ్రాజ్యానికి అధినేత ముఖేశ్ అంబానీ. తండ్రి నుంచి నేర్చుకున్న వ్యాపార పాఠాలతో ఆయన ప్రపంచ కుబేరులో ఒకరిగా నిలబడ్డారు. రిలయన్స్ పేరుతో దాదాపు అన్ని రంగాల్లో వ్యాపారం నిర్వహించారు. రిలయన్స్ జియో ను ప్రారంభించి టెలికాం రంగంలోనే ఓ విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. ఇలా విజయవంతగా రిలయన్స్ సంస్థలను ముందుకు నడిపిస్తున్నారు ముఖేశ్ అంబానీ. అయితే తాజాగా రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పరిణామంలో చోటుచేసుకుంది. రిలయన్స్ జియో యూనిట్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ముఖేశ్ అంబానీ ప్రకటించారు. జియో నూతన చైర్మన్ గా ఆకాశ్ అంబానీ వ్యవహరించనున్నట్టు రిలయన్స్ వెల్లడించింది. రిలయన్స్ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం జూన్ 27న జరిగింది. ఈ సమావేశంలో బోర్డు పలు నిర్ణయాలను తీసుకుంది. రిలయన్స్ జియో డైరెక్టర్‌గా ఉన్న ముకేశ్ అంబానీ తన పదవికి రాజీనామా చేశారు. ముకేశ్ అంబానీ తనయుడు, నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీని ఛైర్మన్‌గా నియమించేందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోద ముద్రవేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇక, కంపెనీ మేనేజింగ్ డైరెక్టెర్ గా పంకజ్ మోహన్ పవార్ పగ్గాలు స్వీకరిస్తున్నారు. జియో కొత్త ఎండీగా పంకజ్ మోహన్ పవార్ ఐదేళ్ల పాటు కొనసాగుతారు. కేవీ చౌదరి, రమీందర్ సింగ్ గుజ్రాల్ జియో బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా కొనసాగుతారు. జూన్ 27 నుంచి ఐదేళ్లపాటు వీరు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. ఇందుకు షేర్‌హోల్డర్స్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ వివరాలను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కంపెనీ సెక్రెటరీ జ్యోతి జైన్ సెక్యూరిటీ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (SEBI) వెల్లడించింది కంపెనీ.మరి.. ఈ విషయాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి. ఇదీ చదవండి: న్యూ లుక్‌తో మార్కెట్‌లో అడుగు పెట్టిన Scorpio-N.. ప్రారంభ ధర ఎంతంటే?