టీవీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పని సరి వస్తువుగా మారిపోయింది. అయితే ఈ టీవీలో కూడా అనేక రకాలు ఉన్నాయి. వాటి సైజును బట్టి, ధరలు ఉంటాయి. అయితే కొంతమందికి పెద్ద టీవీ కొనాలని ఆశ ఉన్న..వారి బడ్జెట్ సరిపోక ఆలోచిస్తుంటారు. రూ. 10వేల లోపు కనీసం ఓ మోస్తారు పెద్ద టీవీ వస్తే బాగుండు అనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. అయితే తక్కువ ధరలో వచ్చే చిన్న టీవీ తీసుకునేందుకు సుముఖంగా ఉండరు. అలా 10 వేల రూపాయల లోపు స్మార్ట్ టీవీకోసంఘ ఎదురుచూస్తున్న వారికి చక్కని అవకాశం. ఇన్ఫినిక్స్ కంపెనీ.. ఓ కొత్త ఆఫర్ ను ప్రకటించింది. తక్కువ ధరలో “Y1 స్మార్ట్ టీవీ” అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు రూ.9000 వేలకే 32 ఇంచుల ఈ టీవీని పొందవచ్చు. అయితే ఇప్పుడు ఈ టీవీ ధరతో పాటు ఫీచర్లను ఒకసారి చూద్దాం.
ఇన్ఫీనిక్స్ కంపెనీ అనేక రకాల స్మార్ట్ టీవీలు మనదేశంలో లాంచ్ చేసింది. తాజాగా 32 అంగుళాల “Y1 స్మార్ట్ టీవీ”ని ధర రూ.8,999కు అందిస్తోంది ఇన్ఫినిక్స్. ఈ టీవీలో అనేక అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. మిగిలిన టీవీలకు ఉన్న ఫీచర్ల అని ఈ టీవీ లో కూడా ఉన్నాయి. ఈ టీవీలో ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీలివ్, జీ5 తదితర ఓటీటీ యాప్‌లు ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఉంటాయని సంస్థ తెలిపింది. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కలిగిన వారికి 10 % తగ్గింపును పొందవచ్చు, అంటే రూ.900. తగ్గింపు లభిస్తుంది. దీంతో కేవలం 8,099 రూపాయలకే వై1 స్మార్ట్‌టీవీని సొంతం చేసుకోవచ్చు.
డాల్బీ ఆడియో సౌండ్ సిస్టం, 20 వాట్ అవుట్‌పుట్ స్పీకర్లకు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే, 512 mb క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4GB స్టోరేజీతో, మూడు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు, ఒక ఆప్టికల్, ఒకటి లాన్, ఒకటి మిరాకాస్ట్, వైఫై, క్రోమ్‌కాస్ట్‌తో ఉంటుందని ఇన్ఫినిక్స్. తెలిపింది. దేశీ మార్కెట్లో అతి చౌక స్మార్ట్ టీవీగా దీన్ని పేర్కొంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలకు అందుబాటులో ఉంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఉద్యోగులకు శుభవార్త! PF విత్ డ్రాపై ఆ నిబంధన ఎత్తివేత..
ఇదీ చదవండి: Amazon Prime: అమెజాన్ ఫ్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎన్ని లాభాలో తెలుసా?..
ఇదీ చదవండి: ఆకాశంలో విహరించాలనుకునే వారికి గుడ్ న్యూస్.. రూ. 9కే విమాన ప్రయాణం!