Amazon Prime: అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈనెల 23వ తేదీన మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ సేల్ సందర్భంగా అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఈనెల 24వ తేదీ వరకు రెండు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సేల్‌లో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమే ఆఫర్లు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది అమెజాన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, అమెజాన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవటం ప్రైమ్ సేల్ మాత్రమే కాదు చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం! అమెజాన్ సబ్‌స్క్రిప్షన్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో మెంబర్షిప్ పొందవచ్చు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు చూడవచ్చు. ప్రైమ్ సభ్యుల కోసమే అమెజాన్ కొన్ని సేల్స్ నిర్వహిస్తుంటుంది. ప్రైమ్ డే సేల్ పేరిట దీన్ని తీసుకొస్తుంది. ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే ఈ సేల్‌లో డీల్స్ పొందవచ్చు.అమెజాన్ షాపింగ్ కోసం ఉచితంగా ఒకటి/రెండు రోజుల డెలివరీ, షెడ్యూల్ డెలివరీ, సేమ్ డే డెలివరీ, ఎక్స్‌ప్రెస్ డెలివరీ ప్రయోజనాలను ఉచితంగా పొందవచ్చు. స్టాండర్డ్ డెలివరీకి ఎలాంటి మినిమన్ ఆర్డర్ వాల్యూ అవసరం లేదు. రూ.500లోపు ప్రొడక్టులను కూడా ఉచితంగా డెలివరీ పొందొచ్చు. అమెజాన్ పేలోనూ ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేకమైన ఆఫర్లు ఉంటాయి. సేల్స్ సమయంలో అమెజాన్ సబ్స్క్రిప్షన్ ఉన్న వారు ఒకరోజు ముందుగానే యాక్సెస్ పొందవచ్చు. డీల్స్ ఆఫ్ ది డే, లైట్నింగ్ డీల్స్ పేరిట ప్రత్యేక సేల్స్‌లో అవకాశం ఉంటుంది. 20 లక్షలకు పైగా పాటలు ఉండే అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్‌ను యాడ్స్ లేకుండా వినొచ్చు. కిండిల్లోని ప్రైమ్ రీడింగ్ లైబ్రరీలో ఉన్న బుక్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. మరి, అమెజాన్ ఫ్రైమ్ సబ్స్క్రిప్షన్ లాభాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : SBI కి షాకిచ్చిన కోర్టు.. మహిళకు అనుకూలంగా తీర్పు.. 54 లక్షల లోను మాఫీ!