ఇప్పుడు అందరూ స్మార్ట్ టీవీలనే కొనుగోలు చేస్తున్నారు. అయితే వాటిలో ఏ స్మార్ట్ టీవీని కొనాలి? ఎంత బడ్జెట్ లో కొనాలి? ఎలాంటి ఫీచర్లు ఉండాలి? అనే విషయాలు మాత్రం చాలా మందికి తెలియదు. అందుకే మీకోసం ఒక బడ్జెట్ స్మార్ట్ టీవీని తీసుకొచ్చాం. అది కూడా వన్ ప్లస్ వంటి బిగ్గెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ఇది.
ఇప్పుడు అందరూ స్మార్ట్ టీవీలనే కొనుగోలు చేస్తున్నారు. పైగా పోర్టబుల్ టీవీల కాలం పోయింది. అందుకే అన్ని కంపెనీలు స్మార్ట్ టీవీలని మాత్రమే తయారు చేస్తున్నాయి. అయితే స్మార్ట్ టీవీల్లో కూడా ఏ టీవీని కొనుగోలు చేయాలి? ఎంత బడ్జెట్ లో కొనుగోలు చేయాలి? ప్రశ్నలు కచ్చితంగా వెంటాడుతుంటాయి. అయితే మీకు ఇప్పుడు ఒక బెస్ట్ స్మార్ట్ టీవీ గురించి చెప్పబోతున్నాం. ఆ బ్రాండెడ్ టీవీ పైగా బడ్జెట్ లోనే ఉంటుంది. అదే వన్ ప్లస్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ అనమాట. ఈ బ్రాండెడ్ స్మార్ట్ టీవీకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అలాంటి బ్రాండ్ నుంచి ఇంత తక్కువ ధరకే స్మార్ట్ టీవీ వస్తోంది అంటే అది క్రేజీ డీల్ అనే చెప్పాలి.
వన్ ప్లస్ బ్రాండ్ కు ఇండియన్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. వన్ ప్లస్ ఫోన్లకి మాత్రమే కాదు.. టీవీలకు కూడా మంచి గుడ్ విల్ ఏర్పడింది. ఇప్పుడు ఈ వన్ ప్లస్ బ్రాండ్ నుంచి వై1 అనే 32 ఇంచెస్ టీవీ ఒకటి మంచి ఆఫర్లో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఆఫర్ కొనసాగుతోంది. నిజానికి ఈ స్మార్ట్ టీవీ ఎమ్మార్పీ రూ.19,999 గా ఉంది. దీనిపై ఫ్లిప్ కార్ట్ లో మీకు 40 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. డిస్కౌంట్ తర్వాత రూ.11,999గా ఉంది. దీనిపై మీకు బ్యాంక్ ఆఫర్ ఉంది. ఎస్ బీఐ బ్యాంక్ కార్డు కలిగిన వారికి ఈ టీవీపై రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అంటే మీకు ఈ టీవీ కేవలం రూ.10,500 కే లభిస్తోంది.
ఇంక ఈ వన్ ప్లస్ వై1 32 ఇంచెస్ టీవీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇది హెచ్ డీ రెడీ ఎల్ ఈడీ డిస్ ప్లేతో వస్తోంది. దీనిలో ఉండే 93% కలర్ గామ్యూట్ విజువల్స్ ని మరింత అందంగా చూపిస్తాయి. గమ్మా ఇంజిన్ వల్ల కలర్ స్పేస్ మ్యాపింగ్, డైనమిక్ కాంట్రాస్ట్ వంటి వాటి వల్ల హై క్వాలిటీ విజువల్స్ చూడచ్చు. దీనిలో డాల్బీ ఆడియో టెక్నాలజీ ఉంది. 20 వాట్స్ డబ్ల్యూ బాక్స్ స్పీకర్స్ ఈ టీవీలో ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది బేజల్ లెస్ డిజైన్ తో వస్తోంది. అంటే మీకు ఫ్రేమ్ లేకుండా మొత్తం డిస్ ప్లే నే కనిపిస్తుంది. జీనిసో గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. వన్ ప్లస్ కనెక్ట్ ద్వారా మీరు టీవీకి సంబంధించిన ఎన్నో ఫీచర్స్ యాప్ ద్వారా కంట్రోల్ చేయచ్చు. ఫ్లిప్ కార్ట్ లో ఈ టీవీకి 89,900కి పైగా రేటింగ్స్, 7,900కి పైగా రివ్యూలు ఉన్నాయి.