స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లే కాదు.. టీవీలు కూడా ఎప్పుడో స్మార్ట్ అయిపోయాయి. ఇప్పుడు టీవీ అంటే కేవలం స్మార్ట్ టీవీ మాత్రమే. ఇప్పటికే చాలా కొత్త కంపెనీలు కూడా స్మార్ట్ టీవీలు తయారు చేయడం ప్రారంభించాయి. తాజాగా ఐఫాల్కన్ కంపెనీ నుంచి ఒక 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ విడుదలైంది.
ఈ స్మార్ట్ యుగంలో అన్నీ స్మార్ట్ గానే ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే టీవీలు కూడా పోర్టబుల్ నుంచి స్మార్ట్ టీవీలుగా మారాయి. భారత్ అనేది ఎలక్ట్రానిక్స్ కి ఎంత గొప్ప మార్కెట్ అనేది అందరకీ తెలుసు. అన్ని టీవీ కంపెనీలు దాదాపుగా స్మార్ట్ టీవీలను తయారు చేయడం ప్రారంభించాయి. చాలా కొత్త కంపెనీలు కూడా స్మార్ట్ టీవీల తయారీలో అడుగుబెట్టాయి. ఇప్పుడు ఫాల్కన్ అనే కంపెనీ నుంచి ఒక అద్భుతమైన బడ్జెట్ టీవీ అందుబాటులోకి వచ్చింది. డిజైన్ పరంగా ఈ ఫాల్కన్ టీవీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇది ఫ్రేమ్ లెస్ డిజైన్ తో వస్తోంది. ఇంక ఇందులో ఫీచర్లు కూడా ఎన్నో ఉన్నాయి.
ఐఫాల్కన్ అనే టీవీ కంపెనీని 2017లో ప్రారంభించారు. ఆ తర్వాత వీళ్లు చాలా టీవీ మోడల్స్ ని రిలీజ్ చేశారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఇప్పుడు రిలీజ్ చేసిన ఐఫాల్కన్ బేజెల్ లెస్ ఎస్ సిరీస్ హెచ్ డీ రెడీ టీవీ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ 32 ఇంచెస్ టీవీ ఎల్ఈడీ డిస్ ప్లేతో వస్తోంది. ఈ టీవీ నెట్ ఫ్లిక్స్, జీ, ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ యాప్స్ ని సపోర్ట్ చేస్తుంది. 768పీ రెజల్యూషన్, 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్ కంట్రోల్ కూడా అందుబాటులో ఉంది. ఈ రిమోట్ డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది. నెట్ ఫ్లిక్స్, ఓకే గూగుల్, ప్రైమ్ వంటి యాప్స్ కోసం సెపరేట్ బటన్స్ కూడా ఇచ్చారు.
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీలో హెచ్ డీఆర్ 10 అనే టెక్నాలజీ ఉంది. దీని ద్వారా మీకు మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్ లభిస్తుంది. మైక్రో డిమ్మింగ్ అనే టెక్నాలజీ కూడా ఉంది. 24 వాట్స్ పవర్ ఫుల్ డాల్బీ స్పీకర్స్, బిల్టిన్ క్రోమ్ కాస్ట్ ఉన్నాయి. ఇందులో ఏఐపీక్యూ ఇంజిన్ ఉంది. అంటే ఇది రూమ్ వాతావరణాన్ని బట్టి సౌండ్, విజువల్ మూడ్ ని అడ్జస్ట్ చేస్తుంది. దీని ద్వారా మీకు మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్ లభిస్తుంది. ఇందులో 178 డిగ్రీస్ వ్యూయింగ్ యాంగిల్ ఉండటం విశేషం. ఇందులో 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఉంది. దీని ధర రూ.19,999 కాగా 35 శాతం డిస్కౌంట్ తో రూ.12,999కే అందిస్తున్నారు. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.