దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శామ్‌సంగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. భారత్ లో శామ్‌సంగ్ ప్రొడక్ట్స్ ఎన్నో వినియోగదారులు వినియోగిస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో టీవీలు మార్కెట్ లోకి తీసుకు వస్తుంది శాంసన్ కంపెనీ.
ప్రపంచంలో టెక్నాలజీ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. నిత్యం ఏదో ఒక కొత్త వస్తువును ఆవిష్కరిస్తున్నారు. టీవీ, సెల్ ఫోన్ ఇతర ఉపయోగకర వస్తువులు కొత్త కొత్త ఫీచర్స్ తో మన ముందుకు తీసుకువస్తున్నారు. సాధారణంగా మనం వేలు లేదా లక్షల్లో ఉన్న టీవీలను ఇప్పటి వరకు చూశాం. తమ రేంజ్ కి తగ్గట్టు టీవీలను కొనుగోలు చేస్తుంటారు. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ శాంసన్ కంపెనీ వారు ఈ భూమి మీద దొరికే అత్యంత కఠినమైన పదార్థంతో తయారుచేసిన ఎల్‌ఈడీ టీవీని ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఈ టీవీ ధర కోటి రూపాయలు.. దీని ఫీచర్లు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే. వివరాల్లోకి వెళితే..
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ కంపెనీ తాజాగా లగ్జరీ కోటి రూపాయలకు పైగా విలువ చేసే టీవీని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అత్యంత శక్తవంతమైన రంగులు.. పదునైనా కాంట్రాస్ట్, లైఫ్ లైక్ ప్రాతినిధ్యంతో అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని ఇస్తుంది. 110 అంగులల మైక్రో ఎల్ఈడీ 4 కే డిస్ ప్లేను ఇచ్చారు. ఎం1ఏఐ ప్రాసెసర్ ను ఉపయోగించారు. సఫైర్ గ్లాస్ తో తయారు చేసిన 24.8 మిలియన్ మైక్రో ఎల్ఈడీలు ఇందులో అర్చారు. మొబైల్ మిర్రరింగ్, వైఫై కనెక్టివిటీ తో పాటు డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్లున్నట్లు కంపెనీ వెల్లడించింది. శాంసన్ మైక్రో ఎల్ఈడీ టీవీ భూమిపై రెండో అత్యంత కఠినమైన పదార్థం నీలమణితో తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ టీవీలో మరో ప్రత్యేకత ఏంటంటే.. శక్తివంతమైన రంగులు కూడా కంటికి ఇంపుగా కనిపిస్తాయని శాంసన్ సంస్థ ప్రకటించింది.
ఇక నాలుగు మూలాల నుంచి కంటెంట్ ని వీక్షణించే మల్టీ వ్యూ మినిమలిస్టిక్ మోనోలిత్ డిజైన్‌తో ఈ టీవీ. దీనికి ప్రత్యేకంగా అమర్చిన ఆర్ట్ మోడ్, యాంబియంట్ మోడ్+ ద్వారా టీవీని ఆర్ట్ డిస్‌ప్లే వాల్‌గా మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఇండోర్ లైటింగ్ ఉపయోగించి చార్జ్ చేయగల సోలార్ సెల్ రిమోట్ ఉంటుందని సంస్థ పేర్కొంది. ఇది పర్యావరణ స్పృహ కలిగిన వినియోగదారులకు ఇది గొప్ప ఎంపిక అని అంటున్నారు. ఈ టీవీలో మల్టీ ఇంటెలిజెన్స్ ఏఐ అప్ స్కేలింగ్, మైక్రో హెచ్ డీఆర్, సీన్ అడాప్టివ్ కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ ఎక్స్ పాన్షన్ ప్లస్ వంటి ఫీచర్లను కలిగి ఉందని శాంసన్ సంస్థ తెలిపింది. శాంసంగ్ మైక్రో ఎల్ఈడీ టీవీ దేశంలోని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో, శాంసంగ్ అధీకృత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు శాంసన్ కంపెనీ తెలిపింది.