సిటీల్లో అయితే దాదాపుగా అందరూ వైఫై కనెక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే స్మార్ట్ టీవీలు వాడుతున్నారు కాబట్టి ఓటీటీ యాప్స్ కోసం వైఫై పెట్టించుకుంటారు. అయితే ఇప్పుడు రివర్స్ లో వైఫై తీసుకుంటే స్మార్ట్ టీవీ ఫ్రీగా వస్తోంది. అది కూడా కేవలం రూ.999 ప్లాన్ తోనే.
ఇంటర్నెట్ వాడకం దేశవ్యాప్తంగా ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొబైల్ డేటా, వైఫై అంటూ డేటా తెగ వాడేస్తున్నారు. స్మార్ట్ టీవీలు వచ్చిన తర్వాత ఇంట్లో కచ్చితంగా వైఫై కనెక్షన్ పెట్టించుకుంటున్నారు. ఎందుకంటే స్మార్ట్ టీవీలో ఓటీటీ యాప్స్, క్రికెట్, సీరయల్స్ ని చూసేందుకు మొబైల్ డేటా సరిపోదు. కాబట్టే వైఫై కనెక్షన్ కి మొగ్గు చూపుతున్నారు. అలా వైఫై కొత్త కనెక్షన్ తీసుకునే వారికి ఇది గొప్ప శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఈ వైఫై కనెక్షన్ తీసుకుంటే మీకు స్మార్ట్ టీవీ, ఓటీటీ యాప్స్, లైవ్ ఛానల్స్ అన్నీ వస్తున్నాయి. అది కూడా నెలకు రూ.999 ప్లాన్ కే ఇవ్వడం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.
ఈ ఆఫర్ ప్రకటించింది ఎక్సైటెల్ అనే బ్రాడ్ బ్యాండ్ సంస్థ. ఇది భారత్ కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ. ప్రస్తుతం వీళ్లు ఇస్తున్న ఆఫర్ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వైరల్ అవుతోంది. ఎందుకంటే బ్రాడ్ బ్యాడ్ కనెక్షన్ తీసుకుంటే.. వీళ్లు టీవీని ఫ్రీగా ఇస్తున్నారు. ఈ మాట వినగానే అందరూ ఇలాగే ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు మార్కెట్ లో ఎంత లేదన్నా.. ఒక స్మార్ట్ టీవీ సగటు ధర రూ.10 వేలు ఉంది. అలాంటిది నెలకు రూ.999 కనెక్షన్ తీసుకుంటనే స్మార్ట్ టీవీ ఫ్రీగా ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతానికి ఈ ఆఫర్ ఢిల్లీలోనే అందుబాటులో ఉన్నా.. త్వరలోనే వీళ్ల సేవలు, ఈ ప్లాన్ ని మిగిలిన రాష్ట్రాల్లో కూడా విస్తరించే అవకాశం లేకపోలేదు.
ఇంక వీళ్ల ప్లాన్ విషయానికి వస్తే.. దీనిని బండిల్ ప్యాక్ గా పిలుస్తున్నారు. ఇందులో నెలకు రూ.999తో 300 ఎంబీపీఎస్ డేటా లభిస్తుంది. దీనితో పాటుగా 6 ఓటీటీ యాప్స్ యాక్సెస్, 300కి పైగా లైవ్ ఛానల్స్ చూసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇంక టీవీ కూడా మంచి ఫీచర్స్ ఉన్నదే ఆఫర్ చేస్తున్నారు. ఇది 32 ఇంచెస్ ఫ్రేమ్ లెస్ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ. ఇందులో 2 10 వాట్స్ పవర్ ఫుల్ స్పీకర్స్ ఉన్నాయి. 512 ఎంపీ రోమ్, 4 జీబీ ర్యామ్ ఉంది. ఆండ్రాయిడ్ 9 వర్షన్ తో వస్తోంది. దీనిపై వన్ ఇయర్ వారెంటీ కూడా ఉంది. ఈ బ్రాడ్ బ్యాండ్ కంపెనీ అందిస్తున్న ఆఫర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.