సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఎంత చెబుతున్నా కొందరు అవేమి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని అవకాశంగా మలుచుకొని కోట్లు కొల్లగొడుతున్నారు సైబర్ మాయగాళ్లు. ఇప్పటివరకు జనాల్ని మోసం చేస్తూ వస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఏకంగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి నకిలీ యాప్స్‌ను రిలీజ్ చేస్తున్నారు. గూగుల్ నిర్వహించే భద్రతా తనిఖీలను కూడా తప్పించుకొని ప్లే స్టోర్స్‌లో యాప్స్‌ను కన్చించేలా చేస్తున్నారు. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లో యూజర్లకు డేటాను దొంగలిస్తున్న 10 యాప్స్‌ను గూగుల్ గుర్తించింది.
ఇప్పటికే ఈ యాప్స్ ని 60 మిలియన్ల యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ యాప్స్ సహాయంతో హ్యాకర్లు యూజర్ల కచ్చితమైన లొకేషన్‌ను తెలుసుకోవచ్చునని కూడా నివేదిక పేర్కొంది. దాంతో పాటుగా ఈ యాప్‌లను ఉపయోగించి ఈ-మెయిల్స్, ఫోన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లను హ్యకర్లు దొంగిలిస్తున్నట్లు తెలిపింది. ‘కట్ అండ్ పేస్ట్’ పద్ధతి.. యూజరు ఏదైనా OTP లేదా ఇతర వివరాలను కాపీ-పేస్ట్ చేసినప్పుడు, హ్యాకర్లు ఈ యాప్‌ల సహాయంతో డేటాను తెలుసుకుంటారని పేర్కొంది. అంతేకాకుండా.. హ్యకర్లు ఈ యాప్స్ సహాయంతో యూజర్ల వాట్సాప్‌ను కూడా యాక్సెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: కిలాడీ లేడీ మాటలు నమ్మింది, 2.5 కోట్లు పోగొట్టుకుంది
గూగుల్ ప్లే స్టోర్ నిషేధించిన 10 యాప్స్ ఇవే..
1. వై పై మౌస్ (రిమోట్ కంట్రోల్ పీసీ)
2. ఫుల్ ఖురాన్ ఎంపీ3-50 లాంగ్వేజ్స్ & ట్రాన్స్‌లేషన్ ఆడియో
3. Audiosdroid ఆడియో స్టూడియో DAW
4. QR అండ్ బార్‌కోడ్ స్కానర్ (డెవలపర్: యాప్ సోర్స్ హబ్)
5. కీబ్లా కంపాస్ – రమదాన్ 2022
6. సింపుల్ వెదర్ అండ్ క్లాక్ విడ్జెట్ (డెవలపర్:డిఫర్ సంస్థ)
7. హ్యాండ్‌సెంట్ నెక్స్ట్ ఎస్‌ఎంఎస్- టెక్స్ట్ విత్ ఎంఎంఎస్
8. స్పీడ్ రాడార్ కెమెరా
9. ఆల్ మావోజిన్ లైట్ (ప్రార్థన సమయాలు)
10. స్మార్ట్ కిట్ 360
Google banned the following 10 #Android apps from play store as these were stealing users personal data pic.twitter.com/grUeHK0C9h
— Kunal Chowdhury ⚡️ (@kunaldchowdhury) April 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.