ఓ గేమింగ్ ప్లాట్ ఫారం.. ఊపిరి పీల్చుకో.. నా మోడిఫైడ్ వెర్షన్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా వచ్చింది. తిరిగి ఇండియాలో అడుగు పెట్టింది. పండగ చేసుకోండిరా పబ్జీ ప్రియులారా అని పబ్జీ అంటోంది.
మొబైల్ గేమ్స్ లో పబ్జీ ఆటకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఏ ఆటకు లేనంత క్రేజ్ ఈ పబ్జీ గేమ్ కి ఉంది. ఎంతలా అంటే టైం, మనుషులను మర్చిపోయి మరీ వేరే లోకానికి వెళ్లిపోయేంతగా క్రేజ్ ఉంది. ఈ గేమ్ ఎంతోమందికి ఒక ఎమోషన్. లవర్స్ కంటే ఎక్కువ. లవర్ కావాలా? పబ్జీ గేమ్ కావాలా? అని అడిగితే నాకు పబ్జీనే ముఖ్యం అనే గేమ్ లవర్స్ ఉన్నారు. అంత క్రేజ్ ఉంది యూత్ లో. అలాంటి గేమ్ నిషేధానికి గురైందని తెలిసి చాలా మంది జీవితాన్ని కోల్పోయినట్టు అయిపోయారు. బాహుబలి సినిమాలో కట్టప్ప వెన్నుపోటుకు బాహుబలి చనిపోతే.. మాహిష్మతి సామ్రాజ్యం ఎలా వెలవెలబోయిందో అలా గేమింగ్ ప్లాట్ ఫారం బతుకు ప్లాట్ ఫారం అయిపోయింది.
అయితే మళ్ళీ బాహుబలి రూపంలో శివుడు వస్తే మాహిష్మతి ప్రజలు ఎలా అయితే సంబరాలు చేసుకున్నారో.. బీజీఎంఐ రూపంలో పబ్జీ తిరిగి వచ్చినప్పుడు కూడా అంతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం దేశ బహిష్కరణకు గురైన పబ్జీ గేమ్ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మార్పులు, చేర్పుల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) పేరుతో భారత్ లో మళ్ళీ అడుగుపెట్టింది. ఎప్పుడైతే క్రాఫ్టాన్ కంపెనీ మళ్ళీ మేము పబ్జీని తీసుకొస్తున్నామని చెప్పిందో అప్పటి నుంచి పబ్జీ లవర్స్ ఆతురతగా ఎదురుచూస్తున్నారు. లవర్ లేక, జాబ్ లేక ఆలోచనలతో చచ్చిపోతున్న మా మైండ్ ని రిలీఫ్ చేసే గేమ్ ని త్వరగా వదలండి బాబు అంటూ పబ్జీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు.
వారి ఎదురుచూపులకు తగ్గట్టే పబ్జీ గేమ్ రిలీజ్ అయ్యింది. 2022లో ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69ఏ కింద భద్రతా కారణాల రీత్యా చైనా యాప్స్ తో పాటు ఈ పబ్జీ గేమ్ ను కూడా ప్రభుత్వం నిషేధించింది. జూలై నెలలో ఈ పబ్జీ గేమ్ ని ఇండియాలోని ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి తొలగించారు. భద్రత విషయంలో దేశానికి అనుగుణంగా మార్పులు చేసిన క్రాఫ్టాన్ ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపింది. చర్చలు సఫలమవ్వడంతో పబ్జీ గేమ్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. భారత ప్రభుత్వ అనుమతులతో పబ్జీ మోడిఫైడ్ వెర్షన్ బీజీఎంఐ అందుబాటులోకి వచ్చింది. భారతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకునేలా ఈ గేమ్ ని మార్పులు చేసింది.
అలానే ప్లేయర్లకు సురక్షితమైన మరియు మంచి గేమింగ్ అనుభూతిని అందిస్తామని కంపెనీ ప్రకటించింది. ఇండియాలో గేమ్ ని రీలాంఛ్ చేస్తామని మూడు రోజుల క్రితం చెప్పిన క్రాఫ్టాన్ కంపెనీ చెప్పినట్టుగానే గేమ్ ని ప్లే స్టోర్ లో పెట్టింది. అయితే గేమ్ ఇలా పెట్టిందో లేదో దెబ్బకు సర్వర్ డౌన్ అయిపోయింది. కొంతమందికి ప్లే స్టోర్ లో చూపిస్తుంది. కొంతమందికి చూపించడం లేదు. అందుకే మీ కోసం లింక్ ని ఇస్తున్నాము. గేమ్ డౌన్ లోడ్ చేసుకోవడం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.