ఆసియా ఖండంలోనే అత్యంత ధనవందుడైన గౌతమ్ అదానీ మరో అరుదైన ఘనత తన సొంతం చేసుకున్నారు. ఆస్తుల్లో 100 బిలియన్ క్లబ్(దాదాపు 7 లక్షల కోట్లు) డాలర్ల క్లబ్ లో చేరిపోయారు. అంతేకాకుండా.. ప్రపంచంలోనే పదో అత్యంత ధనవంతుడిగా అదానీ రికార్డు సృష్టించారు. 2022 సవంత్సరంలో అదానీ ఆస్తులు 23.5 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఒక్క ఏప్రిల్ నెల ఒకటో తారీఖు ఒక్కరోజే అదానీ ఆస్తి విలువ 2.44 బిలియన్ డాలర్లు పెరిగింది. అంతేకాకుండా అత్యంత ఆస్తిపరుల జాబితాలో ముఖేశ్ అంబానీని అదానీ వెనక్కు నెట్టారు. ఆసియా ఖండం, భారతదేశంలో అదానీనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ప్రపంచం మొత్తం చూసుకుంటే 99 బిలియన్ డాలర్ల ఆస్తులతో ముఖేశ్ అంబానీ 11వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ వివరాలను బూమరాంగ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది.
ఇదీ చదవండి: విలీనంతో HDFC బ్యాంక్ షేర్లకు పెరిగిన డిమాండ్! దూసుకెళ్తున్న షేర్లు
ఈ నేపథ్యంలో అదానీ ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి వారున్న 100 బిలియన్ క్లబ్ లో చేరిపోయారు. ఈ క్లబ్ లో బిల్ గేట్స్ 1999లో చేరారు. జెఫ్ బెజోస్ 2017లో 100 బిలియన్ క్లబ్ లో చేరారు. ఎలన్ మస్క్ 2020లో ఈ క్లబ్ లో 273 బిలియన్ డాలర్ల ఆస్తులతో ప్రంపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. 188 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ రెండో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.