నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇలా మోడీ ఇంటి పేరున్న వ్యక్తులు దొంగలు అని రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు పర్యావసానమే ఈరోజు అనర్హత వేటుకు కారణమైంది. అయితే తనపై అనర్హత వేటుకు అసలు కారణం అది కాదని.. అదానీ గురించి ప్రశ్నించినందుకే బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనపై లేనిపోని అబాండాలు వేస్తుందని అన్నారు. అదానీ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 20 వేల కోట్లు ఎవరివి అని ప్రశ్నించినందుకే తనపై అనర్హత వేటు వేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
అదానీ సామ్రాజ్యం ఒక మాయాజాలం అంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ వదిలిన నివేదిక ఎంత పని చేసిందో అందరికీ విధితమే. లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. అదానీ గ్రూప్ కంపెనీలతో పాటు ఆయన వ్యక్తిగత సంపద కూడా తిరిగిపోయింది. ఈ ఘటన మరవక ముందే హిండెన్ బర్గ్ మరొకరి అక్రమాల చిట్టా ఇదేనంటూ రిపోర్ట్ వదలడం కలకలం రేపుతోంది.
ఒక్క రిపోర్టుతో అదానీ గ్రూప్‌ను కుదేలు చేసిన హిండెన్‌బర్గ్.. మరో బాంబును పేల్చేందుకు రెడీ అవుతోంది. ఈసారి ఎవర్ని టార్గెట్ చేయనుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మళ్లీ అవతరించారు.. గౌతమ్ అదానీని వెనక్కినెట్టి అంబానీ 82 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలో సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినట్లు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2023 స్పష్టం చేసింది.
సెలబ్రిటీల ఇంట వివాహ వేడుక అంటే ఎంత ఘనంగా, అంగరంగ వైభవంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోట్లు ఖర్చు చేసి.. అట్టహసంగా వేడుకలు నిర్వహిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా అత్యంత నిరాడంబరంగా.. తన కుమారుడి నిశ్చితార్థం వేడుక నిర్వహించారు గౌతమ్ అదానీ. ఆ వివారాలు..
ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. హిండెన్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో లక్షల కోట్ల సంపదను నష్టపోయినా, ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. వేల కోట్ల రుణాలను గడువుకు ముందే చెల్లిస్తూ.. ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసం నింపుతున్నారు. తాజగా, రూ. 21వేల కోట్లకుపైగా అప్పులను రెండు వారాల ముందే చెల్లించి వార్తల్లో నిలిచారు.
హిండెన్‌బర్గ్ నివేదకలు.. గత కొన్ని రోజులుగా భారదేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నివేదికల దెబ్బకు గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఇక తాజాగా ఎస్‌వీబీ బ్యాంక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెటిజనులు హిండెన్‌బర్గ్‌పై విమర్శలు చేస్తున్నారు.
'అదానీగ్రూప్ vs వివాదాలు' ఈ వ్యవహారం ఇప్పటిలో సద్దుమనిగేలా కనిపించటం లేదు. ఒకటి పోతే మరొకటి అదానీ గ్రూప్ మెడకు ఉచ్చు బిగిస్తున్నాయి. ఇప్పటికే.. అమెరికన్ రీసర్చ్ సంస్థ ''హిండెన్‌బర్గ్' వెల్లడించిన నివేదికల ధాటికి లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయాన వికీపీడియా ఆరోపణలు మరోసారి తలనొప్పిగా మారాయి. వికీపీడియాను అదానీ గ్రూప్ తమకు అనుకూలంగా మార్చుకుందన్నది ప్రధాన ఆరోపణ.
ప్రస్తుతం అదానీ గ్రూప్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అదానీపై స్టాక్ మ్యానిప్యులేషన్ ఆరోపణలు రావడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పాతాళానికి పడిపోయాయి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అదానీకి సహాయం చేసేందుకు ఓ ప్రభుత్వ బ్యాంకు ముందుకొచ్చింది. అదానీ పరిస్థితి తెలిసే లోన్ ఇస్తామని ప్రకటించింది.
హిండెన్ బర్గ్ రీసెర్చ్ తో అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్ ను విపరీతంగా ప్రభావితం చేసింది. అయితే ఇప్పుడు ఈ వివాదం కళారంగాన్ని సైతం ప్రభావితం చేసింది. ఓ అవార్డు స్పాన్సర్ అదానీ అని తెలిసి ఒక కవయిత్రి ఆ అవార్డు నాకొద్దు అంటూ తిరస్కరించారు.